హిందీ రీమేక్ గా 'అప‌రిచితుడు'..డిటేల్స్


తమిళ  స్టార్ ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన చిత్రాల్లో గుర్తుండిపోయే మూవీల్లో అన్నియ‌న్(తెలుగులో అప‌రిచితుడు) ఒక‌టి. విక్ర‌మ్ హీరోగా తెర‌కెక్కిన ఈ చిత్రం పెద్ద హిట్.  అంతేకాదు ఈ సినిమాలో త‌న న‌ట‌న‌తో హీరోగా నెక్ట్స్ లెవిల్ కు వెళ్లాడు విక్ర‌మ్.  ఈ సినిమా వ‌చ్చి 16 ఏళ్లు అవుతుంది. 2005లో వ‌చ్చిన ఈ చిత్రాన్ని ఇప్పుడు హిందీలో రీమేక్ చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. 

Shankar to remake  Aparichithudu  in Bollywood with Ranveer Singh jsp

హిందీ వాళ్ల‌కు మన సౌతిండయిన్  క‌థ‌ల‌పై మ‌క్కువ రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఫరవాలేదు అనుకున్న సినిమాలను సైతం ఒదిలిపెట్టడం లేదు. ఇక ఇప్పుడు పాత సినిమాల రైట్స్ కూడా తీసేసుకుని రీమేక్ చేసేందుకు రెడీ అయ్యిపోతున్నారు.  తాజాగా వాళ్ల దృష్టి `అప‌రిచితుడు`పై ప‌డినట్లు సమాచారం. ఆ సినిమా రీమేక్ లో బాలీవుడ్ యంగ్ హీరో ఒకరు నటించటానికి ఉత్సాహం చూపిస్తున్నారు.

తమిళ  స్టార్ ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన చిత్రాల్లో గుర్తుండిపోయే మూవీల్లో అన్నియ‌న్(తెలుగులో అప‌రిచితుడు) ఒక‌టి. విక్ర‌మ్ హీరోగా తెర‌కెక్కిన ఈ చిత్రం పెద్ద హిట్.  అంతేకాదు ఈ సినిమాలో త‌న న‌ట‌న‌తో హీరోగా నెక్ట్స్ లెవిల్ కు వెళ్లాడు విక్ర‌మ్.  ఈ సినిమా వ‌చ్చి 16 ఏళ్లు అవుతుంది. 2005లో వ‌చ్చిన ఈ చిత్రాన్ని ఇప్పుడు హిందీలో రీమేక్ చేయ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. 

ఈ సినిమాని రీమేక్ చేయమని ఓ బాలీవుడ్ పెద్ద ప్రొడక్షన్ హౌస్ .. శంక‌ర్ ని సంప్ర‌దించినంద‌ని బాలీవుడ్ టాక్‌. దానికి శంక‌ర్ కూడా ఓకే చెప్పాడ‌ట‌. బాలీవుడ్ యంగ్ స్టార్ ర‌ణ‌బీర్ సింగ్ ఈ సినిమాలో హీరోగా న‌టించే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది‌. రోహిత్ శెట్టి తెర‌కెక్కిస్తోన్న స‌ర్క‌స్ మూవీకి కాస్త బ్రేక్ ఇచ్చిర ర‌ణ్‌వీర్ చెన్నైకి వ‌చ్చి మ‌రీ శంక‌ర్‌ని క‌లిశారు. 

అయితే రామ్ చ‌ర‌ణ్‌తో పాటు ఈ మూవీలో ర‌ణ్‌వీర్ క‌నిపించ‌నున్నాడ‌ని.. అందుకే అత‌డు వ‌చ్చి ర‌ణ్‌వీర్‌ని క‌లిశాడ‌ని టాక్ వ‌చ్చింది. కానీ తాజా స‌మాచారం ప్రకారం అప‌రిచితుడు రీమేక్ కోసం ర‌ణ్‌వీర్, శంక‌ర్‌ని క‌లిసిన‌ట్లు తెలుస్తోంది.శంక‌ర్ ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ ప్రాజెక్టుతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్త‌య్యాకే.. అప‌రిచితుడు బాలీవుడ్ రీమేక్ మొద‌ల‌వుతుంది. .

ఇక రామ్‌చరణ్‌,శంకర్‌ కాంబో విషయానికి వస్తే ఇదో పొలిటికల్‌ థ్రిల్లర్‌. ఈ సినిమాలో రష్మిక మందన నటించనుందని వార్తలొస్తున్నాయి. చరణ్‌ - రష్మిక పేరును శంకర్‌, దిల్‌రాజులకు సూచించాడని చెప్పుకుంటున్నారు. దిల్‌రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇది ఆ  సంస్థకు 50వ చిత్రం. ఇంకా పేరు పెట్టని ఈ సినిమాని 3డీ ఫార్మాట్‌లో చిత్రీకరించాలని దర్శకుడు శంకర్‌ యోచిస్తున్నాడట. మరో వైపు అనిరుధ్‌ని సంగీత దర్శకుడిగా తీసుకోవాలనే ఆలోచనలో శంకర్‌ ఉన్నాడనే వార్తలొస్తున్నాయి. రష్మిక చాలా బిజీగా ఉన్నప్పటికీ శంకర్‌ దర్శకత్వంలో నటించేందుకు ఒప్పుకోనుందని సినీవర్గాల సమాచారం. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios