కోలీవుడ్ సంచలన దర్శకుడు శంకర్ 2.0 లాంటి భారీ ప్రాజెక్ట్ తో కాస్త నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. సినిమా అనుకున్నంతగా హిట్టవ్వకపోవడంతో ఆయన తదుపరి సినిమాపై ద్రుష్టి పెట్టారు. అదే ఇండియన్ 2. కమల్ హాసన్ తో గత కొన్ని రోజుల క్రితమే సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. 

అయితే సినిమా షూటింగ్ కి బడ్జెట్ కారణాలతో పాటు కమల్ హాసన్ పాలిటిక్స్ అలాగే బిగ్ బాస్ షో వల్ల బ్రేకులు పడుతున్నాయి. దీంతో శంకర్ య గ్యాప్ లో టైమ్ వెస్ట్ చేయకుండా మరో స్క్రిప్ట్ పనులను స్టార్ట్ చేశాడు. 1999లో వచ్చిన ముదల్వన్  (ఒకే ఒక్కడు) సినిమాకు కొనసాగింపుగా మరో కథను అల్లుతున్నాడు. ఈ ప్రాజెక్ట్ లో నటించేందుకు పలువురు సౌత్ స్టార్ హీరోలు సిద్ధంగా ఉన్నారని టాక్ వచ్చింది.

కానీ ఫైనల్ గా శంకర్ విజయ్ ని సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇండియన్ 2 తో హిట్టు కొడితేనే ఇలయథలపతి విజయ్, శంకర్ తో వర్క్ చేస్తానని చెప్పాడట. కానీ ఇండియన్ 2 ఇప్పట్లో అయిపోయేలా లేదు.  కమల్ ఎప్పుడు షూటింగ్ కి వస్తాడో కూడా తెలియదు. ఈ సమస్యలతో గ్రేట్ డైరెక్టర్ చాలానే ఇబ్బందులు పడుతున్నాడట. మొత్తానికి ఒక రెండు కథలనైతే శంకర్ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం.