2.0 చిత్రం ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డులను ఎంతవరకు బద్దలు కొడుతుందో గాని ప్రమోషన్స్ తో మాత్రం బాగానే ఆకర్షిస్తోంది. శంకర్ సృష్టించిన ఈ విజువల్ వండర్ ఎప్పుడు వస్తుందా అని గత ఏడాది నుంచి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఫైనల్ గా సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇప్పటికే తమిళ్ లో రెగ్యులర్ గా ఇంటర్వ్యూలను ఇస్తూ శంకర్ సినిమాపై అంచనాలు పెంచుతున్నాడు. మరోవైపు అక్షయ్ కుమార్ కూడా బాలీవుడ్ లో సినిమాకు హైప్ వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే త్వరలోనే టాలీవుడ్ లో కూడా చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను భారీ స్థాయిలో చేయాలనీ అనుకుంటోంది. 

శంకర్ సినిమాలకు టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ ఉంది. పైగా రజినీకాంత్ నటించడంతో కలెక్షన్స్ కూడా భారీగా వచ్చే అవకాశం ఉంది. అందుకే సినిమా ప్రమోషన్స్ ను తెలుగులో కూడా భారీ స్థాయిలో నిర్వహించాలని దర్శకుడు శంకర్ ఆలోచించుకున్నాడు. మరికొన్ని రోజుల్లో ఒక ఈవెంట్ ను నిర్వహించి ఆ ఈవెంట్ కు స్టార్ నటీనటులను దర్శకులను ఇన్వైట్ చేయనున్నారట. వారిద్వారా తెలుగు ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించాలని అనుకుంటున్నారు. మరి ఆ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.