శంకర్-చెర్రీ మూవీ బడ్జెట్ అంతా? రిస్క్ అవుతుందేమో
తెలుగు చిత్ర పరిశ్రమలో మరో క్రేజీ కాంబోకు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. ప్రముఖ దర్శకుడు శంకర్ డైరెక్షన్లో రామ్‌చరణ్ ఓ సినిమాలో నటించనున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఈ సినిమా చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది.
‘ఇండియన్ 2’ సినిమా వివాదంలో చిక్కుకున్న శంకర్‌కు కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఊరటనివ్వటంతో రామ్‌చరణ్‌తో శంకర్ చేయనున్న ఈ సినిమాకు లైన్ క్లియర్ అయింది. దాంతో ఈ ప్యాన్ ఇండియా సినిమాని భారీగా లాంచ్ చేసారు. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇది ఖచ్చితంగా క్రేజీ కాంబో . ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు ఈ సినిమా చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు బడ్జెట్ ఎంత పెట్టబోతున్నారనేది హాట్ టాపిక్ గా మారింది.
శంకర్ అంటే భారీతనానికి పెట్టింది పేరు. అదే సమయంలో చరణ్‌కు మాస్లో మంచి ఇమేజ్ ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని శంకర్ కథను సిద్ధం చేసిన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా పొలిటికల్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కనుందని ఓ టాక్. గతంలో ‘ఒకే ఒక్కడు’ తరహాలో ఇందులో చరణ్ పాత్ర ఉంటుందని గుసగుసలు వినిపించాయి. ఐఏఎస్ అధికారి సీఎం అయితే, సమాజంలో ఎలాంటి మార్పు తెచ్చాడన్న ఇతివృత్తంతో కథ సాగుతుందని చెప్తన్నారు. అంతేకాదండోయ్, ఈ మెగా హీరోను.. ఈ మెగా డైరెక్టర్ ఎలాగో అదిరిపోయేలా చూపిస్తారు.
కాబట్టి ఆ విషయం ప్రక్కన పెడితే ఈ సినిమాకు బడ్జెట్ గా 170 కోట్లు పెడుతున్నారనేది వార్త. అంత పెట్టడం భారీ రిస్కే అంటున్నారు. అందుకు కారణం శంకర్ వరసగా చేసిన సినిమాలు విజయ్ తో నంబన్(స్నేహితుడు), విక్రమ్ ఐ, రజనీతో చేసిన 2.0 ఈ మూడు చిత్రాలు రిలీజ్ కు ముందు భారీగా బజ్ క్రియేట్ చేసాయి. కానీ ఆ స్దాయిలో వర్కవుట్ కాలేదు. రోబో సీక్వెల్ 2.0 ని దిల్ రాజు రిలీజ్ చేసారు కానీ కమర్షియల్ గా ఫెయిల్యూర్ అనేది అప్పట్లో తేలింది. ఈ నేపధ్యంలో 170 కోట్లు రికవరీ అనేది మామూలు విషయం కాదు. అయితే ఎంతో అనుభవం ఉన్న నిర్మాత దిల్ రాజు కు లెక్కలు వేరేగా ఉంటాయి. ఆయన ప్రతీ పైసా తెరపై కనపడేలా చూస్తారు. అలాగే బిజినెస్ విషయంలోనూ దిల్ రాజు లెక్కలే వేరు. అదే వర్కవుట్ అవుతుందంటున్నారు.
చరణ్ - శంకర్ కలయిక, పాన్ ఇండియా స్థాయి సినిమాగా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. శంకర్ చిత్రాల్లో కనిపించే భారీదనంతో పాటు, రామ్‌చరణ్ నుంచి అభిమానులు కోరుకునే మాస్ అంశాలు పుష్కలంగా ఈ సినిమాలో ఉంటాయట. ఇప్పటివరకూ రామ్‌చరణ్ చేయని సరికొత్త పాత్రలో శంకర్ చెర్రీని చూపించనున్నారు. పాన్ ఇండియా సినిమా కావడంతో తారాగణం కూడా భారీగానే ఉండనుంది. ఇది మాకొక మైలురాయి. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై 50వ చిత్రంగా ఇంతకు ముందెప్పుడూ చూడని రెండు బలమైన శక్తులను కలిపి తెరపై చూపించబోతున్నాం. మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, ఇండియన్ సినిమా షో మెన్ శంకర్‌లతో కలిసి పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది అంటున్నారు దిల్ రాజు.