సంచలన దర్శకుడు శంకర్ కెరీర్ లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఒక స్టార్ డైరెక్టర్ ఎదిగిన విషయం అందరికి తెలిసిందే. అయితే మొదటిసారి ఈ స్టార్ డైరెక్టర్ షూటింగ్ మొదటిదశలోనే ప్రొడక్షన్ సంస్థతో విబేధాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇండియన్ 2 షూటింగ్ గత కొంత కాలంగా ఏ రేంజ్ లో వాయిదాలు పడుతుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. 

అయితే ప్రస్తుతం సినిమా నిర్మాతలతో శంకర్ గ్యాప్ లేకుండా చర్చలు జరుపుతున్నాడు. 2.0 సినిమాతో కాస్త దెబ్బతిన్న లైకా ప్రొడక్షన్స్ ఇండియన్ 2 విషయంలో మళ్ళీ అత్యధిక బడ్జెట్ పెట్టి చేతులు కాల్చుకోలేమని శంకర్ కి ఒక క్లారిటీ ఇచ్చేసింది. మొదట్లో తగ్గేది లేదని మొండిగా ఉన్న శంకర్ ఇప్పుడు కాస్త వెనుకడుగు వేసినట్లు సమాచారం. 

లైకా ఇచ్చిన బడ్జెట్ లోనే సినిమాను తెరకెక్కించేందుకు శంకర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అయితే కథానాయకుడు కమల్ హాసన్ ఈ విషయంలో కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ కమల్ అవేమి పట్టించుకోకుండా షూటింగ్ లేకుంటే పాలిటిక్స్ అండ్ బిగ్ బాస్ షోతో బిజీ అవుతున్నాడు. ఆగస్ట్ సెకండ్ వీక్ లో శంకర్ ఇండియన్ 2 సినిమా షూటింగ్ వేగాన్ని పెంచనున్నట్లు సమాచారం.