అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన షాలిని పాండే వచ్చిన అవకాశాలను మిస్ చేసుకోకుండా బాగానే యూజ్ చేసుకుంటోంది. తమిళ్ లో 100% లవ్ రీమేక్ లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. గత ఏడాది మహానటి బయోపిక్ లో సావిత్రి స్నేహితురాలిగా కనిపించిన బేబీ ఇటీవల విడుదలైన ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు లో షావుకారు జానకిగా నటించింది. 

అలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తన టాలెంట్ ను తెరపై చూపిస్తోంది. అయితే మోడ్రన్ క్యారెక్టర్స్ రావలే గాని అప్పుడు కూడా తన సత్తా చూపిస్తాను అని ఫొటో షూట్స్ తో చెప్పిన షాలిని హాట్ గా డ్యాన్స్ చేయడం కూడా వచ్చని తన స్కిల్స్ ను ప్రదర్శించింది. ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. 

షాలిని వేసిన హాట్ స్టెప్స్ కి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. చూస్తుంటే స్టార్ హీరోయిన్స్ కి త్వరలోనే గట్టి పోటీ ఇచ్చేలా ఉందని స్పైసి స్టెప్స్ తో అదరగొట్టేసిందని కామెంట్స్ వస్తున్నాయి.