రెండేళ్ల క్రితం విడుదలైన సంచలన చిత్రం అర్జున్ రెడ్డితో వెండితెరకు పరిచయమైంది. అర్జున్ రెడ్డి చిత్రం సాధించింది. వాస్తవానికి అర్జున్ రెడ్డి చిత్రంలో విజయ్ దేవరకొండ కష్టం ఎంతుందో షాలిని పాండే కష్టం కూడా అంతే ఉంది. డెబ్యూ హీరోయిన్ గా అలాంటి బోల్డ్ రోల్ లో నటించి మెప్పించడం అంత సులువు కాదు. 

ముద్దు సన్నివేశాల్లో కూడా షాలిని ఎలాంటి తడబాటు లేకుండా ధైర్యంగా నటించింది. కానీ అర్జున్ రెడ్డి క్రెడిట్ మాత్రం విజయ్ దేవరకొండ అకౌంట్ లో పడిపోయింది. అర్జున్ రెడ్డి సక్సెస్ ని కూడా షాలిని పాండే ఉపయోగించుకోలేకపోయింది. అర్జున్ రెడ్డి తర్వాత షాలిని పాండే కొన్ని చిత్రాల్లో నటించినా అవి అంతగా సక్సెస్ కాలేదు. 

దర్శకుడు సందీప్ రెడ్డి ఈ చిత్రాన్ని హిందీలో షాహిద్ కపూర్ తో కబీర్ సింగ్ గా తెరకెక్కించాడు. ఇటీవల విడుదలైన అర్జున్ రెడ్డి చిత్రం షాహిద్ కపూర్ కేరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా దూసుకుపోతోంది. ఈ చిత్రంలో షాలిని పాండే పాత్రలో కియారా అద్వానీ నటించింది. కబీర్ సింగ్ చిత్రం ద్వారా షాహిద్ తో పాటు కియారా కూడా ప్రశంసలు దక్కించుకుంది. నార్త్ యువతంతా ప్రస్తుతం కియారా గురించి చర్చించుకుంటున్నారు. 

కబీర్ సింగ్ చిత్ర యూనిట్ తో కియారా విరివిగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంది. ఈ చిత్రంపై వస్తున్న విమర్శలని తిప్పికొడుతూ తనని తాను బాగా ప్రమోట్ చేసుకుంది. తెలుగు వర్షన్ లో కష్టమంతా షాలినిదే అయినా కియారా తరహాలో అర్జున్ రెడ్డి చిత్రాన్ని ఆమె ఉపయోగించుకోలేకపోయింది. కబీర్ సింగ్ చిత్రంపై కూడా షాలిని ఇంతవరకు స్పందించలేదు.