షకీల అంటే శృంగార చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌. బీ గ్రేడ్ చిత్రాల నటి అయిన స్టార్ హీరోలకు కూడ గట్టి పోటి ఇచ్చింది ఈ శృంగార తార. అయితే ఆమె కేవలం లాంటి చిత్రాలు మాత్రమే చేస్తుందన్న అపవాదు ఉంది. అందుకే అన్ని రకాల సినిమాలు చేయగలనని నిరూపించుకోవడం కోసం షకీల రూపొందిస్తున్న సినిమా `షకీల రాసిన మొట్టమొదటి కుటుంబ కథా చిత్రం`.

ఈ సినిమాలో విక్రాంత్‌, పల్లవి ఘోష్‌  హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. సి.హెచ్‌.వెంకట్‌రెడ్డి  నిర్మాత. కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ సాయిరాం దాసరి. సరికొత్త కథతో రూపుదిద్దుకున్న ఈ మూవీ ఇప్పటికే షూటింగ్‌, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుంది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాకు క్లీన్ యూ సర్టిఫికెట్ వచ్చింది.

అటు షకీలా సినీ ప్రస్థానంలో కానీ ఇటు సాయి రామ్ దాసరి సినీ జీవితంలో ఇదే తొలి క్లీన్ యూ సర్టిఫికెట్ సినిమా.. కేవలం `జగన్ అన్న` అనే ఒక పదం మ్యూట్ తప్ప ఎటువంటి కట్లు, మ్యూట్లు లేవు లేకుండా ఈ సినిమాకు సర్టిఫికేట్‌  జారీ చేశారు అధికారులు. తన ప్రతి సినిమా విడుదలకు ముందు ఏదో ఒక కాంట్రవర్సీ తో వార్తల్లోకి ఎక్కే సాయి రామ్ దాసరి.. క్లీన్ యూ సర్టిఫికెట్ సినిమా తియ్యడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకు సి.హెచ్. వెంకట్ రెడ్డి నిర్మాత. లండన్ గణేష్ సహా నిర్మాత. మధు పొన్నస్ సంగీత దర్శకులు.

రెండు గంటల రెండు నిమిషాల వ్యవధిలో 9 పాటలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు.. సంపూర్ణంగా కుటుంబ కథా చిత్రం అని.. ఇది నేరుగా ఓ.టి.టి.లో విడుదల చెయ్యాలా లేక సినిమా హాల్ లో విడుదల చెయ్యాలా అనే విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సాయి రామ్ దాసరి తెలిపారు. త్వరలో పూర్తి వివరాలు తెలుపుతాము అని చెప్పారు.