Asianet News TeluguAsianet News Telugu

వర్మ రూటులోనే షకీలా సైతం!

వంద కు పైగా సినిమాల్లో నటించిన షకీలా వాటిలో ఎక్కువ శాతం అశ్లీలం, అసభ్యత ఉన్న సినిమాలే కావటం విశేషం.  తమిళం మళయాళం తెలుగు కన్నడ హిందీ సినిమాలలో కనిపించిన షకీలా కొన్నేళ్ల నుండి అశ్రీల పాత్రలు తగ్గించి క్యారక్టెర్ ఆర్టిస్ట్ పాత్రలు వేస్తూ వస్తోంది. కాగా ఆమె ప్రధాన పాత్రలో ''షకీలా రాసిన మొట్ట మొదటి కుటుంబ కథా చిత్రమ్'' అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. విక్రాంత్ - పల్లవి ఘోష్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో షకీలా కీలక పాత్రలో కనిపించనుంది. 

Shakeela movie will be released in Ott
Author
Hyderabad, First Published Jul 2, 2020, 4:05 PM IST

రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రాలు క్లైమాక్స్, నగ్నం రెండూ ఓటీటిలో రిలీజ్ చేయటం చాలా మందికి ప్రేరణ ఇస్తున్నట్లుంది. ఈ నేపద్యంలో తమ సినిమాను సైతం ఓటీటిలో రిలీజ్ చేయటానికి షకీలా నిర్మాతలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓటీటిలలో చిన్న సినిమాలకు ఉన్న ఆదరణ ను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రయత్నం చేస్తున్నట్లు చెప్తున్నారు. 

వివరాల్లోకి వెళితే.. వంద కు పైగా సినిమాల్లో నటించిన షకీలా వాటిలో ఎక్కువ శాతం అశ్లీలం, అసభ్యత ఉన్న సినిమాలే కావటం విశేషం.  తమిళం మళయాళం తెలుగు కన్నడ హిందీ సినిమాలలో కనిపించిన షకీలా కొన్నేళ్ల నుండి అశ్రీల పాత్రలు తగ్గించి క్యారక్టెర్ ఆర్టిస్ట్ పాత్రలు వేస్తూ వస్తోంది. కాగా ఆమె ప్రధాన పాత్రలో ''షకీలా రాసిన మొట్ట మొదటి కుటుంబ కథా చిత్రమ్'' అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. విక్రాంత్ - పల్లవి ఘోష్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో షకీలా కీలక పాత్రలో కనిపించనుంది. 

వీఎన్ సతీష్ ఈ సినిమాకి స్టోరీ - డైలాగ్స్ - డైరెక్షన్ చేయగా సాయిరామ్ దాసరి కాన్సెప్ట్ - స్క్రీన్ ప్లే అందించారు. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని ఈ సినిమాకి క్లీన్ యూ సెన్సార్ సర్టిఫికెట్ వచ్చింది. అటు షకీలా సినీ ప్రస్థానంలో కానీ ఇటు సాయి రామ్ దాసరి సినీ జీవితంలో కానీ ఇదే తొలి క్లీన్ యూ సర్టిఫికెట్ సినిమా కావడం విశేషం. ఈ సినిమాని ఇప్పుడు ఓటీటికు ఇస్తున్నట్లు సమాచారం. 

 ఈ సినిమా ఇప్పటికే చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని  సెన్సార్ కూడా పూర్తి చేసుకోవటంతో ఏ విధమైన అడ్డంకులూ లేవు.  సెన్సార్ వారు ఈ సినిమాలో కేవలం “జగన్ అన్న” అనే ఒక పదం మ్యూట్ తప్ప ఎటువంటి కట్లు, మ్యూట్లు లేవు. రెండు గంటల రెండు నిమిషాల వ్యవధిలో 9 పాటలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తుంది. అయితే సంపూర్ణంగా కుటుంబ కథా చిత్రం గా కాస్తున్న ఈ సినిమాను నేరుగా ఓ.టి.టి.లో విడుదల చెయ్యాలా లేక సినిమా హాల్ లో విడుదల చెయ్యాలా అనే విషయంలో తర్జన భర్జన పడి చివరకి ఓటీటికే ఓటేసారు.  ఇప్పటికే స్ట్రీమింగ్ సూన్ అని మేకర్స్ పోస్టర్ ను విడుదల చేశారు. కాకపోతే ఏ ఓటీటి ఫ్లాట్ ఫార్మ్ లో విడుదల అవుతుందో అని మాత్రం ప్రకటించలేదు.

Follow Us:
Download App:
  • android
  • ios