ఒకప్పుడు బి గ్రేడ్ సినిమాలతో స్టార్ హీరోలను సైతం భయపెట్టిన సుందరి షకీలా. మలయాళంలో ఆమెకున్న స్టార్ డమ్ చూసి పెద్ద సినిమా నిర్మాతలు కూడా రిలీజ్ డేట్స్ ను వాయిదా వేసుకునేవారు. 

ఒకప్పుడు బి గ్రేడ్ సినిమాలతో స్టార్ హీరోలను సైతం భయపెట్టిన సుందరి షకీలా. మలయాళంలో ఆమెకున్న స్టార్ డమ్ చూసి పెద్ద సినిమా నిర్మాతలు కూడా రిలీజ్ డేట్స్ ను వాయిదా వేసుకునేవారు. కొన్నేళ్ల పాటు హై రేంజ్ లో ఉన్న ఆమె గత కొన్నేళ్లుగా అవకాశాలు లేక నటనకు దూరంగా ఉంటున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇకపోతే ప్రస్తుతం ఆమెకు సంబందించిన బయోపిక్ తెరక్కుతున్న సంగతి తెలిసిందే. కన్నడ ఫిల్మ్ మేకర్ ఇంద్రజిత్ తెరకెక్కిస్తున్న ఆ సినిమాలో రిచా చద్దా షకీలా పాత్రలో కనిపించనుంది. ఇకపోతే సినిమాలో షకీలా కూడా కనిపించనుందని తెలుస్తోంది. కొన్ని సన్నివేశాల కోసం దర్శకుడు షకీలానే నటించాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

తెలుగు హిందీ తో పాటు తమిళ్ మలయాళం భాషల్లో కూడా సినిమా ఒకేసారి తెరక్కుతోంది. ఎమోషన్ తో పాటు థ్రిల్లింగ్ అనిపించే అంశాలు కూడా సినిమా కథలో ఉంటాయట. 2019లో వీలైనంత త్వరగా సినిమాను రిలీజ్ చేయడానికి దర్శక నిర్మాతలు ప్రయత్నం చేస్తున్నారు.