Asianet News TeluguAsianet News Telugu

నగ్నంగా కనిపించింది నేను కాదు.. నటి ఆవేదన!

సినిమాల్లో హీరోలకు, హీరోయిన్లకు డూప్ లను ఉపయోగిస్తారని తెలుసు కానీ నగ్నంగా నటించడానికి ఒప్పుకొని హీరోయిన్లకు కూడా డూప్ ను ఉపయోగిస్తారని నా సినిమాల ద్వారానే నాకు తెలిసింది. దర్శకనిర్మాతలు నన్ను ముఖంలో ఎక్స్ ప్రెషన్స్ మాత్రమే పెట్టమని చెప్పేవారు

shakeela about nude scenes in her films

దక్షిణాది సినీ పరిశ్రమలో షకీలా పేరు తెలియని వారుండరు. స్టార్ హీరోల సినిమాలకు సైతం ఆమె నటించే సినిమాలు పోటీగా నిలబడేవి. కొందరు హీరోలు షకీలా సినిమా వస్తుందని తమ సినిమాను వాయిదా వేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.అలాంటి నటి జీవితం ఆధారంగా బయోపిక్ ను రూపొందిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ రిచా చద్దా.. షకీలా పాత్ర పోషించనున్నారు. ఈ సందర్భంగా షకీలా తన జీవితంలో కొన్ని సంగతులను  ప్రేక్షకులతో పంచుకున్నారు. తన సినిమాల్లో నగ్నంగా కనిపించింది ఆమె కాదంటూ షకీలా చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 'సినిమాల్లో హీరోలకు, హీరోయిన్లకు డూప్ లను ఉపయోగిస్తారని తెలుసు కానీ నగ్నంగా నటించడానికి ఒప్పుకొని హీరోయిన్లకు కూడా డూప్ ను ఉపయోగిస్తారని నా సినిమాల ద్వారానే నాకు తెలిసింది. దర్శకనిర్మాతలు నన్ను ముఖంలో ఎక్స్ ప్రెషన్స్ మాత్రమే పెట్టమని చెప్పేవారు. ఆ తరువాత సినిమాలో ఏం చూపిస్తున్నారనేది నాకు తెలియదు. చెన్నైలో ఉండేప్పుడు అక్కడ థియేటర్లు అన్నీ కూడా ప్రేక్షకులతో నిండిపోయేవి. దీంతో నా సినిమాలు ఎలా ఉన్నాయో కూడా నేను చూసుకోలేకపోయేదాన్ని.

సినిమా షూటింగ్ లో ఒక సీన్ చెబుతారు. కానీ చిత్రీకరించేప్పుడు మాత్రం నా పెర్సనల్ బాడీ పార్ట్స్ మీద కెమెరా ఫోకస్ పెట్టేవారు. ఇండస్ట్రీలో చెప్పేది ఒకటి చేసేది మరొకటి. పెద్ద హీరోల సినిమాలకు నా సినిమాలు పోటీ ఇచ్చేవి.. దీంతో నా సినిమాల్లో అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉందని సెన్సార్ పై ఒత్తిడి తేవడం, నా సినిమాలు బ్యాన్ అయ్యేలా చేయడం వంటి చేసేవారు. అర్ధనగ్న సన్నివేశాలను వ్యతిరేకించడంగా మూడేళ్ల పాటు అవకాశాలు లేకుండా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ఆ సమయంలో దర్శకుడు తేజ 'జయం' సినిమాలో ఛాన్స్ ఇచ్చారు.

ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయ్యాను. ఇప్పటికీ కూడా బయటకు వెళ్తున్నానంటే చున్నీ లేకుండా వెళ్లను. నాకు చాలా సిగ్గు. కానీ కెమెరా ముందుకు వెళ్లినప్పుడు మాత్రం చున్నీ లేకుండా బోల్డ్ సీన్స్ లో నటిస్తాను. అది నా వృత్తి కాబట్టి అలా చేస్తాను. నాకు కూడా పెళ్లి చేసుకొని పిల్లలను కనాలని ఉండేది. కానీ కుటుంబ భారం ఎవరు మోస్తారని అమ్మ నా పెళ్లికి అడ్డుపడేది. నాకు 14 ఏళ్ల వయసు నుండి నేను రిలేషన్ షిప్ లో ఉండేదాన్ని. కానీ ఇప్పుడు సింగిల్ లైఫ్ చాలా బావుందనిపిస్తుంది'' అని చెప్పుకొచ్చారు.   

Follow Us:
Download App:
  • android
  • ios