ప్రముఖ రాజకీయనేత, నటుడు కమలహాసన్ తన సొంత పార్టీ ప్రచారం నిమిత్తం రావాలని ఆహ్వానిస్తే తాను తప్పకుండా వెళతానని శృంగార తార షకీలా అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ప్రజలను  విద్యావంతులను, చైతన్య వంతులను చేయాలని కమల్ హాసన్ తరచుగా చెబుతుంటారని అన్నారు. ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పిచండం ద్వారా సమాజంలో ఎంతో మార్పు తేవచ్చనే కమల్ ఉద్దేశ్యాన్ని తాను సమర్థిస్తానని అన్నారు. ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతోనే కమల్ రాజకీయాల్లోకి వచ్చారని, ఆ విషయాన్ని పట్టించుకోకుండా, ఆయనపై విమర్శలు గుప్పించడం తగదని అన్నారు. కాగా, షకీలా నటించిన 250వ చిత్రం ‘శీలవతి’. ఈ చిత్రం టీజర్ ను ఇటీవల విడుదల చేశారు. కేరళలో జరిగిన ఓ వాస్తవ సంఘటన ఆధారంగా రూపొందించిన ఈ చిత్రం సైకలాజికల్ హారర్ థ్రిల్లర్. మేలో విడుదల కానున్న ఈ చిత్రానికి దర్శకుడు సాయిరామ్ దాసరి, నిర్మాత వీరు బాసింశెట్టి.