ఓ ప్రక్కన జొన్న విత్తుల `ఆర్జీవీ` అని ఓ సినిమా తీసే ప్రయత్నాల్లో ఉన్నారు. పవన్ అభిమానుల తరుపున నూతన్ నాయుడు `పరాన్నజీవి` అనే ఓ సినిమా మొదలెట్టి...ఓ పాటను వదిలారు. ఇప్పుడు ఇవన్నీ చాలదన్నట్లు వెబ్ సిరీస్ మొదలవుతోంది. షకలక శంకర్ ప్రధాన పాత్రధారిగా `డే రా బాబా` అనే ఓ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది.
తెలుగు పరిశ్రమను వర్మ పూనినట్లున్నాడు. ఓ ప్రక్కన జొన్న విత్తుల `ఆర్జీవీ` అని ఓ సినిమా తీసే ప్రయత్నాల్లో ఉన్నారు. పవన్ అభిమానుల తరుపున నూతన్ నాయుడు `పరాన్నజీవి` అనే ఓ సినిమా మొదలెట్టి...ఓ పాటను వదిలారు. ఇప్పుడు ఇవన్నీ చాలదన్నట్లు వెబ్ సిరీస్ మొదలవుతోంది. షకలక శంకర్ ప్రధాన పాత్రధారిగా `డే రా బాబా` అనే ఓ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది.
`రా..బాబా` అంటే ఈ వెబ్ సీరిస్ లో రాంగోపాల్ వర్మ. ఆపాత్రలో షకలక శంకర్ నటిస్తున్నాడు. గతంలోనూ జబర్దస్త్ లో రామ్ గోపాల్ వర్మను అనుకరించిన షకలక శంకర్ ఇప్పుడు ఈ వెబ్ సీరిస్ లోనూ వర్మ పాత్రలో చెలరేగపోనున్నారు. వర్మ మానరిజమ్స్, ఆయనకు ఉన్న తిక్క... ఈ వెబ్ సిరీస్ లో పుష్కలంగా కనిపించబోతున్నాయని చెప్తున్నారు.
https://www.youtube.com/watch?v=AweQ6K4g0ds&feature=emb_title
అంతేకాదు కేవలం వర్మనే ఎక్సపోజ్ చేస్తే చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉండరని, మసాలా అంశాలూ కావల్సినన్ని జోడిస్తున్నారు. ఈ విషయాలన్ని హైలెట్ చేస్తూ ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ కట్ చేసి వదిలారు. అంతేకాదు ఈ ట్రైలర్ లో ..ఈ వెబ్ సిరీస్ పవన్ ఫ్యాన్స్‌కి ఫేవర్ గా ఉంటుందని ఓ హింట్ కూడా ఇచ్చారు. అంటే ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ఈ వెబ్ సీరిస్ ని ముందుకు తీసుకెళ్తారనే అర్దమవుతోంది.
ఇక షకలక శంకర్ పవన్ కల్యాణ్ వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. దాంతో వర్మ ...పవన్ కళ్యాణ్ పై పవర్ స్టార్ అనే సినిమా తీస్తూండటంతో ....దానికి కౌంటర్ గా తన అభిమానాన్ని,వర్మ మీద కోపాన్ని ఈ వెబ్ సిరీస్ రూపంలో చూపించబోతున్నాడన్నమాట. అన్నట్టు నూతన్ నాయుడు తీస్తున్న `పరాన్న జీవి`లోనూ ఆర్జీవిగా కనిపించేది వర్మ పోలీకలతో ఉంటే ఓ జూనియర్ ఆర్టిస్ట్ అని టాక్.
