Asianet News TeluguAsianet News Telugu

షారుఖ్ ఖాన్ వారసుడు ఆర్యన్ ఖాన్ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ.. హీరోగా మాత్రం కాదట.

సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఇప్పటికే సన్నాహాలు కూడా పూర్తి అయినట్టు తెలుస్తోంది.  ఈ విషయాన్ని ఆర్యన్ ఖాన్ స్వయంగా వెల్లడించారు.

 

Shahrukh Khan Son Aryan Khan Silver Screen Entry
Author
First Published Dec 7, 2022, 7:09 PM IST

ఇప్పటికే ఫిల్మ్ ఇండస్ట్రీ వారసులతో నిండిపోయి ఉంది. వరుసగా స్టార్ హీరోల తనయులు.. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే బాలీవుడ్ లో మరో  స్టార్ వారసత్వం రాబోతోంది. షారుఖ్ తనయుడు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి రెడీ అవుతున్నాడు. అయితే హీరోగా మాత్రం కాదట. 

సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ ఇప్పటికే సన్నాహాలు కూడా పూర్తి అయినట్టు తెలుస్తోంది.  ఈ విషయాన్ని ఆర్యన్ ఖాన్ స్వయంగా వెల్లడించారు. అయితే ఆర్యన్ ఖాన్ మాత్రం అందరు వారసుల్లా హీరోగా రావడం లేదట.  రచయితగా, దర్శకుడిగా బాలీవుడ్ కి పరిచయం కాబోతున్నాడట ఆర్యన్ ఖాన్.  షారుఖ్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఆర్యన్ తొలి ప్రాజెక్ట్ చేయనున్నారు. 

ఇక ఇప్పటికే స్క్రిప్ట్ రాయడం కూడా పూర్తయిందట. ఈ విషయాన్ని ఆర్యన్ తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆర్యన్ ఏమని రాశాడంటే.. రైటింగ్ కంప్లీట్ అయింది. త్వరలోనే చెప్పాలని ఎదురుచూస్తున్నానని అని రాసుకొచ్చారు.  దీన్ని బట్టి త్వరలోనే ఆర్యన్  మెగాఫోన్ పట్టుకోబోతున్నారని తేలిపోయింది. అయితే  ఎవరితో తన ప్రాజెక్ట్ చేస్తున్నారన్నది మాత్రం ఆయన చెప్పలేదు. ఈ పోస్ట్ చూసిన షారుఖ్ తన కొడుకుని అభినందించారు. వావ్.. ఆలోచించడం, నమ్మడం, కలలు కనడం పూర్తయింది.. ఇప్పుడు బరిలో దిగాలి. నీ ఫస్ట్ ప్రాజెక్ట్ కి ఆల్ ది బెస్ట్. ఇప్పుడు ఎప్పటికీ స్పెషల్ అంటూ కామెంట్ చేశారు.

ఇక ఆర్యన్ ఖాన్ ఆరంగ్రేట్రానికి ఫ్యామిలీతో పాటు ఇండస్ట్రీ నుంచి కూడా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.  షారుఖ్ భార్య, ఆర్యన్ తల్లి గౌరీ ఖాన్ కూడా తనయుడు డెబ్యూ కోసం ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు.పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఆర్యన్ కు ఆల్ ది బెస్ట్ చెప్పారు.  అయితే  తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆర్యన్ ఒక వెబ్ సిరీస్ తీయబోతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం ఆర్యన్ ఖాన్ వెల్లడించలేదు. కాని బాలీవుడ్  రైటర్ బిలాల్ సిద్ధుఖీ దీనిపై ఓ  హింట్ ఇచ్చారు. 

దీంతో ఆర్యన్ వెబ్ సిరీస్ చేయబోతున్నారనే విషయంలో క్లారిటీ వచ్చింది. ఈ సిరీస్ కి సంబంధించిన షూటింగ్ మొత్తం  నైట్ మోడ్ లో ఉంటుందని సమాచారం. అయితే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకూ స్టార్ వారసులు హీరోగానే ఇండస్ట్రీకి వచ్చారు. అందులో కొంత మంది ఇండస్ట్రీని ఏలుతుంటే.. మరికొంత మంది మాత్రం మిడిల్ డ్రాప్ అయ్యారు. కాని షారుఖ్ తనయుడు ఆర్యన్ ఖాన్ మాత్రం కాస్త డిఫరెంట్ గా ఆలోచించాడు. అతను డైరెక్టర్ కావాలి అనుకోవడం ఇండస్ట్రీలో చాలా మందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఫ్యాన్స్ మాత్రం ఆర్యన్ ఖాన్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చినా.. ఆతరువాత హీరోగా పక్కాగా ఎంట్రీ ఇస్తాడంటున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios