Asianet News TeluguAsianet News Telugu

Shahrukh Khan: నువ్వు తెలుగు సీరియల్స్ ప్రమోట్ చేయడం ఏంటి సామీ!

షారుక్ చివరికి తెలుగు సినిమా సీరియల్స్ ప్రమోట్ చేయాల్సి వచ్చింది. స్టార్ మా లో కొత్తగా ప్రారంభం అవుతున్న బ్రహ్మముడి సీరియల్ చూడండి అంటూ ఆయన ఒక ప్రోమో విడుదల చేశారు.

shahrukh khan promotes telugu serial brahmamudi
Author
First Published Jan 21, 2023, 5:40 PM IST

బాలీవుడ్ కి గడ్డుకాలం నడుస్తుంది. బడా బడా స్టార్స్ తిరగబడిపోతున్నారు. వరుస డిజాస్టర్స్ పరిశ్రమను కుదేలు చేస్తున్నాయి. గత ఏడాది ఎన్నడూ చూడనంత క్రిటికల్ పీరియడ్  బాలీవుడ్ చూసింది. అమిర్, హ్రితిక్, అక్షయ్, రణ్వీర్ సింగ్, షాహిద్, జాన్ అబ్రహం... ఒక్కరేంటి అందరూ భారీ ప్లాప్స్ మూటగట్టుకున్నారు. రన్బీర్ కపూర్ మాత్రం బ్రహ్మాస్త్ర చిత్రంతో పర్లేదు అనిపించుకున్నాడు. 

ఇక షారుక్ హిట్ కొట్టి ఏళ్ళు గడిచిపోయింది. బ్లాక్ బస్టర్ కమ్ బ్యాక్ ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నారు. కొన్నేళ్లు గ్యాప్ ఇచ్చి పఠాన్ మూవీ చేశారు. ఈ మూవీని పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో విడుదల చేస్తున్నారు. పఠాన్ చిత్ర ప్రమోషన్స్ కోసం షారుక్ అందుబాటులో ఉన్న ప్రతి మార్గం వాడుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఓ తెలుగు సీరియల్ ప్రమోట్ చేయడం ఆసక్తికరంగా మారింది. 

బాలీవుడ్ బాద్షా గా వెలుగొందిన షారుక్ ఒక రీజన్ లాంగ్వేజ్ సీరియల్ ప్రమోట్ చేయడం ఊహించని పరిణామం. తెలుగు చిత్ర పరిశ్రమ దేశంలోనే అతిపెద్ద మార్కెట్ గా ఎదిగింది. ఇక్కడ టైర్ టు హీరోలు కూడా వంద కోట్లు అవలీలగా కొట్టేస్తున్నారు. అందుకే షారుక్ కి తప్పలేదు. కొత్త సీరియల్ బ్రహ్మముడి తో పాటు తన పఠాన్ చిత్రాన్ని ఆయన ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇందుకు స్టార్ మా ఆయనకు డబ్బులు చెల్లించిందా? లేక ఆయనే తిరిగి వాళ్లకు చెల్లించాడా? అనేది తెలియదు. 

సూపర్ స్టార్ మహేష్ సైతం సీరియల్స్ ప్రమోట్ చేశారు. జీ తెలుగు ఆయనకు కోట్లు చెల్లించి ఓ ఒప్పందం చేసుకుంది. దానిలో భాగంగా జీ తెలుగులో ఆ మధ్య కొత్తగా ప్రారంభమైన సీరియల్స్ ని మహేష్ తన కూతురు సితారతో పాటు ప్రమోట్ చేశారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు... సీరియల్స్ తో టెలివిజన్ ఛానల్స్ కి ఎంత మేర ఆదాయం సమకూరుతుందో. భర్త ఆఫీస్ కి వెళ్ళాక విశ్రాంతి తీసుకునే గృహిణుల నుండి ఇంట్లో ఖాళీగా ఉండే వృద్ధుల వరకూ సీరియల్సే టైం పాస్. 

ఇక వార్ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ పఠాన్ చిత్రానికి దర్శకుడిగా ఉన్నారు. పఠాన్ మూవీ ప్రోమోలు సినిమాపై అంచనాలు పెంచేశాయి. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న పఠాన్ మూవీలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్నారు. జాన్ అబ్రహం విలన్ రోల్ చేస్తున్నారు. జనవరి 25న వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios