థియేటర్లలో రచ్చరచ్చ చేసింది షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీ.. ఇక డిజిట్ ప్లాట్ ఫామ్ ఎక్కడానికి రెడీ అవుతుంది. వెండితెరపై సందడి చేసిన ఈసినిమా.. బుల్లితెరపై ఎలాంటి రికార్డ్స్ సృష్టిస్తుందో చూడాలి. ఇంతకీ పఠాన్ స్క్రీమింగ్ ఎప్పుడు..? ఎక్కడ..?
థియేటర్లలో రచ్చరచ్చ చేసింది షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీ.. ఇక డిజిట్ ప్లాట్ ఫామ్ ఎక్కడానికి రెడీ అవుతుంది. వెండితెరపై సందడి చేసిన ఈసినిమా.. బుల్లితెరపై ఎలాంటి రికార్డ్స్ సృష్టిస్తుందో చూడాలి. ఇంతకీ పఠాన్ స్క్రీమింగ్ ఎప్పుడు..? ఎక్కడ..?
కొంత కాలంగా.. డిజాస్టర్లతో నీరసంగా మారిపోయిన బాలీవుడ్ కు.. పఠాన్ సినిమా శక్తినిచ్చింది. బాలీవుడ్ పని అయిపోయింది.. ఇక పైకి లేవడం కష్టం అనుకున్న టైమ్ లో.. కలెక్షన్ల సునామీతో బాలీవుడ్ కుజవసత్వాలు ఇచ్చింది షారుఖ్ ఖాన్ మూవీ. ఈ సినిమా ధైర్యంతో బాలీవుడ్ స్టార్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. ఇక సినిమాలు చేయడానికి థైర్యం తెచ్చుకున్నారు. పఠాన్ మూవీ రికార్డ్స్ బ్రేక్ చేస్తూ.. దూసుకుపోయింది. ఇప్పటికీ థియేటర్ లో రన్నింగ్ లో ఉంది పఠాన్. బాహుబలి-2 రికార్డును కూడా క్రాస్ చేసిన ఈసినిమా.. థియేటర్లలో ఆడియెన్స్ ను అలరించింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు కూడా రెడీ అవుతోంది.
ఇక పఠాన్ సినిమాను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ భారీ రేటుకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాను ఏప్రిల్ 25 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. దీని కోసం ఇప్పటికే సన్నాహాలు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ చేసేందుకు అమెజాన్ ప్రైమ్ ప్లాన్ చేస్తోన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.
బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖన్ హీరోగా నటించిన పఠాన్ మూవీలో బాలీవుడ్ సీనియర్ బ్యూటీ.. దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటించింది. జాన్ అబ్రహం విలన్ క్యారెక్టర్ లో నటించగా..భారీ అంచనాల మధ్య జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్ కాగా, ఈ సినిమాలోని యాక్షన్, షారుక్ పవర్‌ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ బాలీవుడ్ జనాలకు బాగా నచ్చేసింది. సినిమా రిలీజ్ అయిన మొదటి రోజునుంచే దూసుకుపోయింది. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపిన పఠాన్ సినిమా.. కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక ఓటీటీలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.
