కింగ్ ఖాన్ షారుఖ్ దెబ్బ తిన్న బెబ్బులిలాగా పఠాన్ చిత్రంతో బాక్సాఫీస్ పై విరుచుకు పడ్డాడు. పఠాన్ చిత్రం విడుదలై 20 రోజుల పైనే అవుతోంది. ఇంకా పఠాన్ చిత్రం సాలిడ్ రన్ బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది.
ఇటీవల సౌత్ చిత్రాలు దూసుకుపోతుంటే.. బాలీవుడ్ చాలా డౌన్ ఫాల్ చూసింది. వాళ్ళు ప్రేక్షక పాత్రకే పరిమితం అయ్యారు. బాలీవుడ్ కి పూర్వవైభవం తీసుకువచ్చే చిత్రం కోసం ఎదురుచూస్తున్న సమయంలో.. కింగ్ ఖాన్ షారుఖ్ దెబ్బ తిన్న బెబ్బులిలాగా పఠాన్ చిత్రంతో బాక్సాఫీస్ పై విరుచుకు పడ్డాడు. అలా ఇలా కాదు కెజిఎఫ్, ఆర్ఆర్ఆర్ లాంటి చిత్రాల రికార్డులు సైతం చాలా చోట్ల బ్రేక్ అయ్యాయి.
పఠాన్ చిత్రం విడుదలై 20 రోజుల పైనే అవుతోంది. ఇంకా పఠాన్ చిత్రం సాలిడ్ రన్ బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. ఇదిలా ఉండగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'అలవైకుంఠపురములో' చిత్రం హిందీ లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. షెహజాదాగా ఈ చిత్రాన్ని హిందీలో తెరకెక్కించారు. రోహిత్ ధావన్ దర్శకత్వంలో.. యువహీరో కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ జంటగా నటిస్తున్నారు.ఈ చిత్రం నేడు గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఫిబ్రవరి 10నే రావాల్సింది. పఠాన్ దాటికి తట్టుకోలేమని భావించి వాయిదా వేసుకున్నారు.

అయితే తాజాగా షారుఖ్ ఖాన్.. షెహజాదాకి ఊహించని షాక్ ఇచ్చాడు. పఠాన్ 500 కోట్ల కలెక్షన్స్ క్లబ్ లోకి ఎంటర్ అయింది. దీనితో షారుఖ్ అండ్ టీం ఆ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అన్ని ప్రధాన మల్టిఫ్లెక్స్ థియేటర్స్ పివిఆర్, ఐమాక్స్, సినీపోలీస్, ఇతర మల్టి ఫ్లెక్స్ లలో పఠాన్ చిత్ర టికెట్ ధరని భారీగా తగ్గించారు. 110 రూపాయలకే మల్టిపెక్స్ లలో పఠాన్ టికెట్ లభించనుంది. షారుఖ్ ఫ్యాన్స్ కి ఇది బంపర్ ఆఫర్.
షెహజాదా రిలీజ్ అవుతున్న టైంలో షారుఖ్ తీసుకున్న ఈ నిర్ణయం హాట్ టాపిక్ గామారింది. ఇది షెహజాదాకి గట్టి దెబ్బే అని చెప్పాలి. కుర్ర హీరో కార్తీక్ ఆర్యన్ ఎలా తట్టుకోగలడు అనే అనుమానాలు మొదలయ్యాయి. అసలే షెహజాదాకి అడ్వాన్స్ బుకింగ్స్ అంతంత మాత్రంగానే ఉన్నాయి. చాలా రోజుల తర్వాత బాలీవుడ్ లోకి ఒక పంసందైన కమర్షియల్ చిత్రం పఠాన్ రూపంలో వచ్చింది. ఇప్పుడు టికెట్ ఆఫర్ కూడా లభిస్తోంది. షెహజాదా లేక పఠానా అని ఛాయిస్ ఉన్నప్పుడు మాస్ ప్రేక్షకులు పఠాన్ వైపే వెళతారు. నేడు ఆంట్ మాన్ అండ్ ది వాస్ప్ చిత్రం కూడా రిలీజ్ అవుతోంది. ప్రస్తుతం సూపర్ హీరో చిత్రాలకు ఎలాంటి క్రేజ్ ఉందొ చెప్పనవసరం లేదు. ఇది కూడా షెహజాదా ఎదురుదెబ్బే.
