సీఎం ఇంట్లో షారుఖ్ , సల్మాన్.. గణపతి పూజలో బాలీవుడ్ స్టార్ హీరోలు, వైరల్ అవుతున్న పిక్స్..
ఈమధ్య బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ పూజలు ఎక్కువగా చేసేస్తున్నారు. తాజాగా ఈ ఇద్దరు తారలు కలిసి ప్రత్యేకంగా గణపతి పూజలో పాల్గొన్నారు.

బాలీవుడ్ బాద్ షా .. కింగ్ షారూఖ్ ఖాన్ తో పాటు.. కండల వీరుడు సల్మాన్ ఖాన్ కలిసి ఆదివారం రాత్రి గణపతి పూజలో పాల్గొన్నారు. అది కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఆహ్వానం మేరకు..ఆయన ఇంటికి వెళ్లిన బాలీవుడ్ తారలు వినాయకుడి పూజలో పాల్గోన్నారు. అయితే ఈ సినిమాకు సబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇక ఈ పూజా కార్యక్రమాల్లో.. షారుఖ్ ఖాన్ తో పాటు అతని మేనేజర్ పూజా దద్లానీ కూడా సీఎం ఇంట్లో పూజలో పాల్గొన్నారు. ఇక సల్మాన్ తరపునుంచి సల్మాన్ ఖాన్ కు ఎంతో ఇష్టమైన తన సోదరి అర్పిత ఖాన్, బావ ఆయుష్ శర్మ కూడా ఈ గణేశ్ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమం అనంతరం షారూఖ్, సల్మాన్ ఇద్దరూ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. అంతే కాదు ప్రజలకు శుభాకాంక్షలు కూడా తెలిపారు.
రూక్ బ్లూ కలర్ పఠానీ సూట్ ధరించి పూజ కోసం వచ్చారు షారుఖ్.. ఇక సల్మాన్ ఖాన్ విషయానికి వస్తే.. ఆయన ఎరుపు రంగు కుర్తా ధరించారు. ఖాన్ లతో పాటు బాలీవుడ్ కు చెందిన జాకీ ష్రాఫ్, అర్జున్ రాంపాల్, ఆశా భోంస్లే, బోనీ కపూర్, రష్మీ దేశాయ్ లాంటి స్టార్స్ ను కూడా ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే పూజకు ఆహ్వానించగా.. వారంతా ఆయన ఇంట్లో గణేష్ చతుర్థి వేడుకలకు హాజరయ్యారు. షారుఖ్ ఖాన్ తన చిన్న కుమారుడు అబ్రామ్‌తో కలిసి ముంబయిలోని ప్రసిద్ధ లాల్‌బాగ్చా రాజా వద్ద గణేశుని ఆశీర్వాదం కూడా తీసుకున్నారు.
ఇక సల్మాన్ ఖాన్, షారుఖ్ ఈమధ్య పూజలు బాగా చేస్తున్నారు. జవాన్ రిలీజ్ కు ముందు కూడా షారుఖ్ చాలా దేవాలయాలు సందర్శించారు. అటు కాశ్మీర్ లోని ప్రాచీన ఆలయాన్ని కూడా సందర్శించారు షారుఖ్. కొన్ని దేవాలయాలకు చాలా సీక్రేట్ గా వెళ్లి దర్శనాలుచేసుకున్నారు. ఇంకా మీడియా కంట పడకుండా కూడా కొన్ని ఆలయాలు సందర్శించినట్టు తెలుస్తోంది.