బాలీవుడ్ అర్జున్ రెడ్డి కొత్త లుక్!

టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచి విజయ్ దేవరకొండ కు మాంచి స్టార్ డమ్ తీసుకువచ్చిన చిత్రం అర్జున్ రెడ్డి. ఇప్పుడు ఆ సినిమాను బాలీవుడ్ లో షాహిద్ కపూర్ రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. కథలో పెద్దగా మార్పులు లేకుండా నార్త్ వాతావరణం కనిపించేలా చిత్ర యూనిట్ సినిమాను తెరకెక్కిస్తోంది. 

shahid kapoor new look from kabir sing

టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచి విజయ్ దేవరకొండ కు మాంచి స్టార్ డమ్ తీసుకువచ్చిన చిత్రం అర్జున్ రెడ్డి. ఇప్పుడు ఆ సినిమాను బాలీవుడ్ లో షాహిద్ కపూర్ రీమేక్ చేస్తోన్న సంగతి తెలిసిందే. కథలో పెద్దగా మార్పులు లేకుండా నార్త్ వాతావరణం కనిపించేలా చిత్ర యూనిట్ సినిమాను తెరకెక్కిస్తోంది. 

ఒరిజినల్ దర్శకుడు సందీప్ వంగ ఈ రీమేక్ కు దర్శకత్వం వహిస్తున్నాడు. రీసెంట్ గా కబీర్ సింగ్ అంటూ టైటిల్ కూడా సెట్ చేశారు. అయితే సినిమాలో మరో లుక్ ని కూడా రిలీజ్ చేసి అందరిని ఆకర్షించారు. గడ్డం లేకుండా షాహిద్ క్లీన్ షేవ్ తో అప్పుడే టీనేజ్ దాటినా అబ్బాయిలా కనిపిస్తున్నాడు. ఇక సినిమాలో హీరోయిన్ గా కియారా అద్వానీ నటిస్తోంది. 

సినిమా షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేసి 2018 జూన్ లో సినిమాను రిలీజ్ చెయ్యాలని అనుకుంటున్నారు. మరి బాలీవుడ్ లో సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుంటుందో చూడాలి. తమిళ్ అర్జున్ రెడ్డి వర్మగా రూపుదిద్దుకుంటోంది. విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటిస్తున్న ఆ సినిమాకు బాలా దర్శకత్వం వహిస్తున్నారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios