Asianet News TeluguAsianet News Telugu

సమంతకు బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో ఫిదా.. అంతలా ఆమె ఎందుకు నచ్చిందంటే..

ఈ మధ్య కాలంలో సమంత గురించి ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. తాను నటిస్తున్న సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలతో కూడా సమంత వార్తల్లో నిలుస్తోంది. వివాహం తర్వాత సమంత క్రేజ్ మరింత పెరిగింది.

 

Shahid Kapoor interesting comments on Samantha Akkineni
Author
Hyderabad, First Published Sep 28, 2021, 9:45 AM IST

ఈ మధ్య కాలంలో సమంత గురించి ఎక్కువగా వార్తలు వినిపిస్తున్నాయి. తాను నటిస్తున్న సినిమాలతో పాటు వ్యక్తిగత విషయాలతో కూడా సమంత వార్తల్లో నిలుస్తోంది. వివాహం తర్వాత సమంత క్రేజ్ మరింత పెరిగింది. అంతకు ముందు ఎక్కువగా కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ ఒలకబోసి సామ్.. ఇటీవల మెమొరబుల్ రోల్స్ ఎంచుకుంటోంది. 

రంగస్థలం, ఓ బేబీ లాంటి చిత్రాలు అందుకు ఉదాహరణ. ప్రస్తుతం సమంత గుణశేఖర్ దర్శకత్వంలో పౌరాణిక గాధ శాకుంతలం చిత్రంలో నటిస్తోంది. తన పార్ట్ షూటింగ్ ముగియడంతో సామ్ ఎక్కువగా వెకేషన్స్ లో కనిపిస్తోంది. ఫ్యామిలిమ్యాన్ 2 వెబ్ సిరీస్ తో సమంత ఇండియా మొత్తం ప్రేక్షకులని ఫిదా చేసింది. ఈ వెం సిరీస్ లో సామ్ నెగిటివ్ షేడ్స్ లో అదరగొట్టిన సంగతి తెలిసిందే. 

అంతలా నటనతో మెప్పించే సామ్ కు ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఫ్యామిలీ మ్యాన్ 2లో సామ్ నటనకు చాలా మంది ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. తాజాగా ఆ జాబితాలోకి బాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో షాహిద్ కపూర్ చేరాడు. సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించిన షాహిద్ కపూర్.. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఫ్యామిలీ మ్యాన్ 2పై స్పందించాడు. ఫ్యామిలీ మ్యాన్ 2 నాకు చాలా బాగా నచ్చింది. సమంత నటనకు ఫిదా అయ్యాను. ఛాన్స్ వస్తే ఆమెతో కలసి తప్పకుండా నటిస్తానని షాహిద్ పేర్కొన్నాడు. షాహిద్ కపూర్ ప్రస్తుతం నాని 'జెర్సీ' మూవీ రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉండగా సామ్, చైతు గొడవల కారణంగా విడివిడిగా ఉంటున్నారని, త్వరలో విడాకులు తీసుకోబోతున్నట్లు మీడియాలో పెద్దఎత్తున వార్తలు వస్తున్నాయి. కానీ ఈ వార్తలపై సామ్ కానీ, చైతు కానీ స్పందించడం లేదు. 

Follow Us:
Download App:
  • android
  • ios