అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగ ఇప్పుడు బాలీవుడ్ నిర్మాతలకు కొత్త సమస్య తెచ్చిపెట్టాడు. వాళ్లు అతన్ని తలుచుకుని గోలెత్తిపోతున్నాడు. ఏకంగా 35 కోట్లా అని తమలో తాము మల్లగుల్లాలు పడుతున్నారు.

ఇంతకీ సందీప్ వాళ్లకు చేసిన  అన్యాయం ఏమిటి...ఆ గోలేంటి అని ఆరా తీస్తే...అర్జున్ రెడ్డి  సినిమాతో విజయ్ దేవరకొండను తెలుగులో సూపర్ స్టార్ ని చేసాడు. అదే విధంగా హిందీలోనూ అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో షాహిద్ కపూర్ ని సూపర్ స్టార్ ని చేసాడు. అతని కెరీర్ లో అతి పెద్ద హిట్ సినిమాగా కబీర్ సింగ్ నమోదు అయ్యింది. షాహిద్ గత చిత్రాల కలెక్షన్స్ కు నాలుగు రెట్లు కలెక్ట్ చేసి 300 కోట్ల క్లబ్ లో ఈ సినిమా జాయిన్ అయ్యింది.

గతంలో అతను చేసిన కమీనే, ఉడ్తా పంజాబ్ వంటి చిత్రాలు తెచ్చిన క్రేజ్ ని నాలుగైదు రెట్లు పెంచింది. నెక్ట్స్ లెవిల్ కు షాహిద్ ని ఈ సినిమా తీసుకెళ్లింది.  దాంతో యధావిధిగా షాహిద్ కపూర్ తన రెమ్యునేషన్ ని పెంచేసాడు. సినిమాకు 35 కోట్లు దాకా డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం.  అలాగే ఆల్రెడీ కమిటైన ప్రాజెక్టులు వాళ్లు కూడా అదే రెమ్యునేషన్ ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారట.

బాలీవుడ్ లో షాహిద్ వంటి స్టార్ కు 35 కోట్లు అనేది అతి పెద్ద మొత్తం. దాంతో నిర్మాతలు తల పట్టుకు కూర్చున్నారట. దక్షిణాది నుంచి వచ్చిన డైరక్టర్ ఇచ్చిన హిట్...ఇలా తమకు దెబ్బకొడుతుందని ఊహించలేందంటున్నారట. అయితే సరే షాహిద్ కపూర్ డేట్స్ కోసం ఎగబడుతున్నారట. మరో ప్రక్క హీరో లు అది డైరక్టర్ సినిమా అంటూ సందీప్ వంగతో సినిమా చేయాలని ఉవ్విళ్లూరుతున్నారట. అలా కబీర్ సింగ్ తన విన్యాసం బాలీవుడ్ లో కొనసాగిస్తున్నాడు.