సాధారణంగా అబ్బాయిల్లో చాలా మందికి బైక్ లు, కార్లంటే విపరీతమైన ప్యాషన్ ఉంటుంటుంది. తమకి నచ్చిన వెహికల్ సొంతం చేసుకోవాలని కలలు కంటుంటారు. 

సాధారణంగా అబ్బాయిల్లో చాలా మందికి బైక్ లు, కార్లంటే విపరీతమైన ప్యాషన్ ఉంటుంటుంది. తమకి నచ్చిన వెహికల్ సొంతం చేసుకోవాలని కలలు కంటుంటారు. సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా మంది హీరోలకు ఆటోమొబైల్స్ పిచ్చి. మార్కెట్ లోకి కొత్తగా ఏదైనా వెహికల్ వస్తే.. దాన్ని కొనాలని చూస్తుంటారు. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ కి కూడా ఓ బైక్ నచ్చిందట.

దీంతో దాని ఖరీదు ఎంతనే విషయాన్ని పక్కన పెట్టేసి మరీ ఆ బైక్ సొంతం చేసుకున్నాడు. ఇంతకీ ఆ బైక్ రేటు ఎంతో తెలుసా..? అక్షరాలా రూ.18 లక్షలు. బీఎండబ్ల్యూ కంపనీకి చెందిన బీఎండబ్ల్యూ ఆర్‌ 1250 జీఎస్‌ అడ్వెంచరస్ మోటార్‌సైకిల్‌ కొన్నాడు.

కొత్త బైక్ తో దిగిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. హైఎండ్ బైకులను ఇష్టపడే షాహిద్ దగ్గర ఇప్పటికే డుకాటి స్కాంబ్లర్‌ 1200, హార్లే-డేవిడ్‌సన్‌ ఫాట్‌బాయ్‌, యమహా ఎంటీ 01 బైక్‌లు ఉన్నాయి. ముంబై ట్రాఫిక్ లో నడపడానికి ఈ బైక్ బాగుంటుందని అన్నాడు.

ప్రస్తుతం షాహిద్.. సందీప్ రెడ్డి దర్శకత్వంలో 'అర్జున్ రెడ్డి' రీమేక్ 'కబీర్ సింగ్'లో నటిస్తున్నాడు. ఈ సినిమా కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ ఏడాది జూన్ లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

View post on Instagram