Asianet News TeluguAsianet News Telugu

కూతురు కోసం షారుఖ్ ఖాన్ త్యాగం..? బాలీవుడ్ బాద్ షా ఏం చేయబోతున్నాడు..?

బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ ఖాన్.. మంచి జోరుమీద ఉన్నాడు. వరుస హిట్లతో.. హవా చూపిస్తున్న షారుఖ్.. తన కూతురు కోసం  ఓ త్యాగం చేయబోతున్నట్టు తెలుస్తోంది. 
 

Shah Rukh Khan to Make Sacrifices for His Daughter.. Latest News and Updates JMS
Author
First Published Aug 13, 2024, 11:51 PM IST | Last Updated Aug 13, 2024, 11:51 PM IST

 

దాదాపు నాలుగైదేళ్లు సినిమాలకు దూరంగా ఉన్నాడు బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ ఖాన్. వరుస ప్లాప్ లు ఫేస్ చేయడం, కొడుకు డ్రక్స్ కేసులో ఇరుక్కోవడం.. ఇలా కొన్నాళ్ళు ఆయనకు బ్యాడ్ టైమ్ నడిచింది. ఆతరువాత పటాన్ తో రీ ఎంట్రీ ఇచ్చిన ఆయనకు వరుసగా మూడు సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. వరుసగా.. వెయ్యి కోట్ల సినిమాలతో బాలీవుడ్ కు ఊపిరి పోశాడు షారుఖ్. 

ఇక ఇండస్ట్రీలో అత్యంత ఫాలోయింగ్ ఉన్న స్టార్ హీరోల్లో షారుఖ్ ఖాన్ ఒకరు. బాలీవుడ్ లో ఆయన అంటే పడిచచ్చిపోతారు జనాలు. అద్భుతమైన సినిమాతో ఆడియన్స్ మనసులకు దగ్గరయ్యాడు షారుఖ్. ఇక సినిమాల కోసం ఎంత రిస్క్ చేయడానికైనా షారుఖ్ వెనకాడడు. అలా చాలా ప్రమాదాలు తప్పించుకున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో. ఇక  ఇప్పటికే కొన్ని సినిమాల కోసం బరువు పెరిగి, తగ్గాడు. కానీ ఇప్పుడు తన కూతురు సినిమా కోసం షారుఖ్ బరువు తగ్గనున్నట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం  బాలీవుడ్ లో వినిపిస్తున్న హాట్ హాట్ టాపిక్ ఏంటంటే... కూతురి కోసం షారుఖ్ బరువు తగ్గనున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా షారుఖ్ ఖాన్ వెల్లడించాడు. ఇది విని అభిమానులు థ్రిల్ అవుతున్నారు. స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న ‘లోకార్నో ఫిల్మ్‌ ఫెస్టివల్‌’కి షారూఖ్‌ వెళ్లాడు.   అక్కడ అతనికి ప్రతిష్టాత్మకమైన అవార్డు లభించింది. సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవల ఆధారంగా ఈ గౌరవం లభించింది. 

ఈ సన్మానం పొందేందుకు స్విట్జర్లాండ్ వెళ్లారు షారుఖ్.  సుజయ్ ఘోష్ దర్శకత్వంలో ‘కింగ్’ సినిమాలో నటిస్తానని షారుక్ చెప్పాడు. దీని కోసం అతను బరువు తగ్గనున్నాడ.. ‘యాక్షన్‌ సినిమాలు చేయడం కష్టం. మీరు అభ్యాసం, నేర్చుకోవాలి. దీంతో పాటు ప్రమాదకర విన్యాసాలు చేయాల్సి ఉంటుంది. అందుకే ఆయన బరువు తగ్గాలట. అయితే షారుఖ్ ను తన కూతురు కూడా బరువు తగ్గమనిచెప్పినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios