Asianet News TeluguAsianet News Telugu

అరేరే... సమంతకు వచ్చిన భారీ ఆఫర్.. నిజమా? రూమరా?

ఈ చిత్రంలో సమంతను హీరోయిన్‌గా తీసుకునేందుకు చర్చలు జరుగుతున్నాయని  అన్నారు. ఇదే నిజమైతే...

Shah Rukh Khan Samantha Will NOT Team Up For Rajkumar Hirani Patriotic Film jsp
Author
First Published Jun 25, 2024, 8:09 AM IST

హీరోయిన్‌గా ఎన్నో విభిన్నమైన చిత్రాల్లో నటించిన సమంత గత కొంతకాలంగా కెరీర్ పరంగా వెనకబడింది.  హెల్త్ ఇష్యూలతో బాధపడి ఇప్పుడిప్పుడే రికవరీ అయ్యి మళ్లీ బిజీ అవుతోంది. అయితే పెద్ద హీరోల సినిమాలు దేంట్లోనూ సమంత లేదు. దాంతో ఆమె హీరోయిన్ ఓరియెంటెండ్ సినిమాలు చేస్తోంది. ఈ క్రమంలో ఆమెకు ఓ భారీ ప్రాజెక్టు సెట్ అయ్యిందనే వార్తలు మీడియాలో గుప్పుమన్నాయి. దాంతో ఆమె అభిమానులు పండగ చేసుకున్నారు. కానీ వారి ఆనందం ఎంతోసేపు నిలవలేదు.వివరాల్లోకి వెళితే...

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్‌కి హీరోయిన్ సమంత చాలా పెద్ద అభిమాని అన్న సంగతి తెలిసిందే. అయితే వీళ్లిద్దరూ కలిసి ఒక్క ప్రాజెక్టుకు పనిచేయలేదు. అయితే ఆ సమయం వచ్చేసిందని, ప్రస్తుతం షారూఖ్ ఖాన్ సరసన నటించే బంపర్ ఆఫర్ కొట్టేసిందని నిన్నటి నుంచి మీడియాలో వార్తలు వచ్చాయి. అంతేకాదు ఆ వార్తల్లో టాలెంటెడ్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్‌ మరో సినిమా చేయబోతున్నారని ఉంది. ఈ చిత్రంలో సమంతను హీరోయిన్‌గా తీసుకునేందుకు చర్చలు జరుగుతున్నాయని  అన్నారు. ఇదే నిజమైతే షారూఖ్ తో, రాజ్‌కుమార్ హిరానీతో సమంతకి ఇదే తొలి సినిమా అయ్యేది. కానీ అది ప్రస్తుతానికి ఈ వార్త రూమర్ అనే క్లారిటీ వచ్చింది.
 
ఈ వార్తలపై దర్శకుడు రాజ్​కుమార్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. ఇవన్నీ కేవలం రూమర్స్ అని టీమ్​మెంబర్ ఒకరు తెలిపారు. 'రాజ్​కుమార్ ప్రస్తుతం ఆయన నెక్ట్స్​ మూవీ స్ట్రిప్ట్​ పనుల్లో బిజీగా ఉన్నారు. దీనికి సంబంధించి నటీనటుల ఎంపిక ఇంకా ప్రారంభమే కాలేదు. షారుక్​తోగానీ, సమంతోగానీ ఇప్పటివరకు ఎలాంటి చర్చలు జరపలేదు. ఇక రాజ్​కుమార్ ఇది దేశభక్తి, యాక్షన్ జానర్​లో తెరకెక్కనుందని వాస్తున్న వార్తలన్నీ రూమర్లే' అని డైరెక్టర్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. 

కాగా, షారుక్- రాజ్​కుమార్ కాంబోలో గతేడాది వచ్చిన 'డంకీ' హిట్​ టాక్ సొంతం చేసుకుంది. వరల్డ్​వైడ్​గా రూ.400+ కోట్ల వసూల్ చేసింది. షారుఖ్ త‌దుప‌రి సుహానాతో క‌లిసి కింగ్ అనే మాఫియా నేప‌థ్య‌ చిత్రంలో న‌టించాల్సి ఉంది. మరో ప్రక్క స‌మంత న‌టించిన సిటాడెల్ భార‌తీయ వెర్ష‌న్ హ‌నీబ‌న్ని విడుద‌ల కావాల్సి ఉంది. రాజ్ అండ్ డీకే ఈ సిరీస్‌కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

Shah Rukh Khan Samantha Will NOT Team Up For Rajkumar Hirani Patriotic Film jsp

అలాగే  నిర్మాతగా మారిన సమంత తన కొత్త సినిమాను ప్రకటించింది.  'మా ఇంటి బంగారం' అనే టైటిల్‌తో పోస్టర్‌ విడుదల చేశారు. తన సొంత నిర్మాణ సంస్థలో సమంత లీడ్‌ రోల్‌లో నటిస్తుంది.   పోస్టర్‌లో సమంత చీరకట్టుకుని చేతిలో తుపాకీ పట్టి సీరియస్‌ లుక్‌తో కనిపిస్తుంది. లేడీ ఓరియేంటెడ్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సినిమాలు నిర్మించే విషయంలో హైదరాబాద్‌కు చెందిన ఎంటర్​టైన్​మెంట్ కంపెనీ 'మండోవా మీడియా వర్క్స్'తో సమంత ఒప్పందం కుదుర్చుకుంది. సినిమా ఇండస్ట్రీలో ఈ సంస్థకు మంచి గుర్తింపే ఉంది. తమ భాగస్వామ్యంలో వెబ్ సిరీస్‌తో పాటు సినిమాలు, టీవీ ప్రోగ్రామ్స్‌ రూపొందించే అవకాశం ఉందని మండొవా మీడియా వర్క్స్​ అధినేత హిమాంక్​ దువుర్రు గతంలో తెలిపాడు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios