బాలీవుడ్ స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్. ఈ ఇద్దరు ఒకప్పుడు మంచి స్నేహితులు.. మధ్యలోనే కొన్ని విబేధాలు వచ్చినప్పటికీ మళ్లీ తిరిగి కలిసిపోయారు. ఇప్పుడు వీరి మధ్య బంధం మరింత బలపడింది.

ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్ట్ చేస్తోన్న 'జీరో' సినిమాలో షారుఖ్ ఖాన్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో షారుఖ్ ఖాన్ తో కలిసి సల్మాన్ స్టెప్పులు వేయనున్నారు. తాజాగా సల్మాన్ హోస్ట్ చేస్తోన్న ఓ షోకి షారుఖ్ వెళ్లారు. ఇదే షోలో రాణి ముఖర్జీ పాల్గొని సల్మాన్ ని ఉద్దేశిస్తూ పెళ్లి సంగతి తరువాత ముందు పిల్లల్ని కను అంటూ కామెంట్స్ చేసింది.

అలానే షారుఖ్ ఖాన్ కూడా సల్మాన్ పై జోక్స్ వేశాడు. 'నా కుమారుడు అబ్రం ఖాన్ కూడా సల్మాన్ లానే అమ్మాయి కనిపిస్తే చాలు 'ఐ లవ్యూ' అని చెబుతున్నాడు' అంటూ సల్మాన్ ని టీజ్ చేశాడు. దీంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా నవ్వేశారు. ఇక షారుఖ్ తన జీవితంలో సల్మాన్ ఎంత ముఖ్యమైన వ్యక్తనే విషయాన్ని చెబుతూ తను కానీ తన ఫ్యామిలీ కానీ సమస్యలో ఉంటే గుడ్డిగా సల్మాన్ పై ఆధారపడతామని చెప్పుకొచ్చారు. 

ఇది కూడా చదవండి..

పెళ్లొద్దు కానీ పిల్లల్ని కను.. స్టార్ హీరోకి హీరోయిన్ సలహా!