పెళ్లొద్దు కానీ పిల్లల్ని కను.. స్టార్ హీరోకి హీరోయిన్ సలహా!

https://static.asianetnews.com/images/authors/74ce1d03-f84b-5b8e-abc1-c43c5f7c8632.jpg
First Published 8, Sep 2018, 5:56 PM IST
rani mukerji wants salman khan to have a daughter
Highlights

బాలీవుడ్ స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు. కెరీర్ ఆరంభంలో వీరిద్దరూ మంచి స్నేహితులు. ఆ తరువాత విబేధాల కారణంగా ఇద్దరూ విడిపోయినా.. మళ్లీ కలుసుకున్నారు

బాలీవుడ్ స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు. కెరీర్ ఆరంభంలో వీరిద్దరూ మంచి స్నేహితులు. ఆ తరువాత విబేధాల కారణంగా ఇద్దరూ విడిపోయినా.. మళ్లీ కలుసుకున్నారు.

సల్మాన్ సినిమాల్లో షారుఖ్, షారుఖ్ సినిమాల్లో సల్మాన్ కనిపించి ఫాన్స్ ని సర్ప్రైజ్ చేస్తూనే ఉన్నారు. అయితే వీరి మధ్య స్నేహం బంధుత్వంగా మారితే చూడాలని ఉందంటోంది సీనియర్ హీరోయిన్ రాణీ ముఖర్జీ. షారుఖ్ కుమారుడు అబ్ రామ్ తో సల్మాన్ కూతురికి పెళ్లి జరగాలని కోరుకుంటోంది. అసలు సల్మాన్ కి పెళ్లి కూడా కాకుండా రాణి ముఖర్జీ ఈ విధంగా కామెంట్స్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

ఈలోగా రాణి ముఖర్జీ.. పెళ్లి గురించి వదిలేసి, పిల్లల్ని కనేయ్ అంటూ సల్మాన్ కి సలహాలు ఇచ్చింది. సల్మాన్ ఖాన్ హోస్ట్ చేస్తున్న 'దస్ కా దమ్' ప్రోగామ్ కి హాజరైన రాణి ముఖర్జీ ఈ విధమైన కామెంట్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.  
 

loader