బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కు షాక్ ఇచ్చాడు ఓ అభిమాని. ఓ వింత కోరికతో బాలీవుడ్ హీరో ఉలిక్కిపడేలా చేశాడు. అయితే ఈ విషయంలో కాస్త తేరుకున్న షారుఖ్ ఖాన్.. అదిరిపోయే ఆన్సర్ కూడా ఇచ్చాడు.
షారుఖ్ ఖాన్ కు దేశ వ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే. ఖాన్ అంటే పడిచచ్చిపోతారు జనాలు. బాద్ షా కూడా 60 ఏళ్లు దాటినా.. సిక్స్ ప్యాక్ బాడీతో.. యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు. ఈ ఏజ్ లో కూడా.. భారీ యాక్షన్ సినిమాలు చేస్తూ.. అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు. ఆమధ్య వరుస ఫోయిల్యూర్స్ తో బాధపడ్డ షారుఖ్..జీరో సినిమాతో భారీ డిజాస్టర్ ఫేస్ చేసిన షారుఖ్ ఖాన్.. ఆతరువాత నాలుగేళ్లు సినిమాలకు దూరం అయ్యాడు. రీసెంట్ గా పఠాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో... బాలీవుడ్ కు కూడా ఊపిరిపోశాడు.
పఠాన్' సినిమా ఘన విజయంతో షారుక్ ఖాన్ ఫుల్ జోష్ లో ఉన్నారు.ద ఇక వరుస సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. ఇక మరోవైపు షారుఖ్ తను నటించిన దీవానా సినిమా రిలీజ్ అయ్యి 31 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా... ఈ సందర్భంగా అభిమానులతో షారుక్ సోషల్ మీడియా ద్వారా 31 నిమిషాల పాటు ముచ్చటించారు. 'ఆస్క్ ఎస్ఆర్కే' పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు షారుక్ సమాధానాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా ఓ అభిమాని షారుక్ ఖాన్ కు షాక్ ఇచ్చాడు. ఆస్క్ మీ ప్రోగ్రామ్ లో ఓ వింత కోరికను వెలిబుచ్చాడు అభిమాని. మీతో కలిసి సిగరెట్ తాగాలని ఉందని అన్నాడు. ఈ ప్రశ్నకు షాక్ అయిన షారుక్ ఖాన్.. డిఫరెంట్ గా సమాధానం ఇచ్చాడు. అయితే షారుఖ్ ఇచ్చిన సమాధానం అందరినీ ఆకట్టుకుంటోంది. షారుఖ్ మాట్లాడుతూ.. తన చెడు అలవాట్లను ఎవరితోనూ పంచుకోనని, అవి తనతోనే ఉంటాయని చెప్పారు షారుఖ్. ఇక ఈ విషయంలో షారుక్ సమాధానం పట్ల నెటిజెన్లు పాజిటీవ్ గా స్పందిస్తన్నారు.
రకరకాల కామెంట్లు విసురుతున్నారు. ఈ విషయంలో షారుఖ్ కు కూడా కొన్ని సెటైర్లు పడుతున్నాయి. బాగా చెప్పారని కొందరు ప్రశంసిస్తున్నారు. స్మోకింగ్ అలవాటును మీరు కూడా వదిలేయొచ్చు కదా అని మరికొందరు కోరుతున్నారు. ఇక షారుఖ్ ఖాన్ కు ఎదురైన వింత ప్రశ్న.. దానికి ఆయన ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
