Asianet News TeluguAsianet News Telugu

‘డంకీ’వంటి ప్లాఫ్ నుంచి షారూఖ్ ఎంత ముట్టిందో తెలిస్తే మతిపోతుంది

సూప‌ర్‌స్టార్‌ షారుక్‌ ఖాన్ స్థాయి మాస్‌కి, ఆయ‌న మార్క్ రొమాంటిక్ ఇమేజ్‌ ఈ సినిమా భిన్నంగా ఉండటంతో చాలా మందికి నచ్చలేదు.

Shah Rukh Khan Rakes in Over Rs 200 Crore in Profits From Dunki jsp
Author
First Published Jul 8, 2024, 10:03 AM IST


బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్(Shahrukh Khan), స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీతో  కాంబినేషన్ లో రూపొంది విడుదలైన చిత్రం  ‘డంకీ’.ఈ సినిమా పై దేశ వ్యాప్తంగా మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నా  క్యాష్ చేసుకోలేకపోయిందనే చెప్పాలి.  ఆర్ధ్ర‌త నిండిన సామాజికాంశాలు.. హ‌త్తుకునే భావోద్వేగాలు.. అదే స్థాయి హాస్యంతో క‌ట్టిప‌డేసే ద‌ర్శ‌కుడు రాజ్‌కుమార్ హిరాణీ ఈ సారి తడబడటమే అందుకు కారణం.

 ఈసారి కూడా తన బలమైన సామాజిక అంశాలుకి ఏమాత్రం లోటు చేయకుండా ‘డంకీ’ని తెర‌కెక్కించాలనకున్నా ఆ ఎలిమెంట్స్ వర్కవుట్ కాలేదు. సూప‌ర్‌స్టార్‌ షారుక్‌ ఖాన్ స్థాయి మాస్‌కి, ఆయ‌న మార్క్ రొమాంటిక్ ఇమేజ్‌ ఈ సినిమా భిన్నంగా ఉండటంతో చాలా మందికి నచ్చలేదు. అయితే ఫ్యాన్స్ ని మినహాయిస్తే  షారూఖ్ సినిమాని ఒకసారైనా చూడాలనుకున్న వాళ్లు మాత్రం ఓటిటిలో చూసి సంతృప్తి పడ్డారు. ఓవరాల్ ఈ సినిమా బిలో యావరేజ్ టు ప్లాఫ్ అన్నట్లు ముద్రపడింది.

ఈ క్రమంలో షారూఖ్ కు రెమ్యునరేషన్ గా ఎంత ముట్టిందనే విషయం గమనిస్తే ఆశ్చర్యం వేస్తుంది. బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమా నిమిత్తం 200 కోట్లు పైగానే షూరూఖ్ వాటాగా లాభం అందింది. ఈ సినిమా కు డివైడ్ టాక్ వచ్చినా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా 600 కోట్ల కలెక్షన్స్ దాకా వసూలు చేసింది. 84 కోట్లు షారూఖ్ స్దాయికి అతి తక్కువ బడ్జెట్ తో తయారైన ఈ చిత్రానికి వచ్చిన లాభం మాత్రం అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. పఠాన్, జవాన్ చిత్రాలతో పోల్చి ఈ సినిమాని చిన్నది చేసారు కానీ ఈ సినిమాకు మాత్రం ఎక్కువ లాభాలే వచ్చాయంటున్నారు. 
  
చిత్రం కథేమిటంటే...

పంజాబ్‌లోని ఓ చిన్న విలేజ్ కు చెంచిన  మ‌న్ను (తాప్సి), సుఖి (విక్కీ కౌశ‌ల్‌), బుగ్గు (విక్ర‌మ్ కొచ్చ‌ర్‌), బ‌ల్లి (అనిల్ గ్రోవ‌ర్‌).. లో ఎవరికి తగ్గ సమస్యలు వాళ్లకు ఉంటాయి.ఈ స్నేహితుల జీవితాశయం,కల ఒకటే..వాళ్లంతా ఇంగ్లాండ్ వెళ్లాలని. వాళ్ల సమస్య ఏమిటంటే... టిక్కెట్,వీసా . అయితే వాళ్ల కల నేర్చవేటానికి  ఓ సైనికుడు ముందుకు వస్తాడు. తను ఇంగ్లాండ్ చేరుస్తానని మాట ఇస్తాడు. అక్కడ నుంచి జరిగే జర్ని,బోర్డర్ సమస్యలు, స్నేహం, కుటుంబం పట్ల ప్రేమ, విలువలు చుట్టు తిరుగుతుంది. సవ్యంగా వీసా, పాస్ పోర్ట్ వచ్చేసి వెళ్తే ఏ తిప్పలూ ఉండవు. కానీ వారు వేరే మార్గం ఎంచుకుంటారు. అక్రమ ప్రయాణంలో వారు ప్రయాణం పెట్టుకుంటారు. అదెలా ఎలా ఏమిటి..అనేది ఫన్ తో కూడిన సీన్స్ తో సినిమా ఉండనుంది. డంకీ అంటే దేశ సరిహద్దుల వెంట అక్రమ ప్రయాణం గురించి వివరించే మార్గము.
  
ఈ చిత్రంలో తాప్సీ పన్ను, బోమన్ ఇరానీ, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్ కీలక పాత్రల్లో నటించారు. విక్కీ కౌశల్ ప్రత్యేక పాత్రలో కనిపించారు.  ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్ హిరానీ ఫిలిమ్స్, రెడ్ ఛిల్లీస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, జియో స్టూడియో బ్యానర్లపై రాజ్‌కుమార్ హిరానీ, గౌరీఖాన్‌ సంయుక్తంగా నిర్మించారు.  ఈ మూవీకి అభిజాత్‌ జోషి, రాజ్‌కుమార్ హిరానీ, కనికా ధిల్లాన్‌ కథ అందించింది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios