Asianet News TeluguAsianet News Telugu

Dunki Trailer : ప్రేమ, స్నేహం, ఫుల్ ఆఫ్ ఎమోషన్స్.. షారుక్ ఖాన్ ‘డంకీ’ ట్రైలర్.. చూశారా?

‘డంకీ డ్రాప్ 4’ ద్వారా షారుఖ్ ఖాన్ నటించిన ‘డంకీ’ ట్రైలర్ విడుదలైంది. ఇప్పటికే వచ్చిన అప్డేట్స్ తో అంచనాలు పెరిగిపోయాయి. తాజాగా విడుదలైన ట్రైలర్ హృదయాలను ఆకట్టుకునేలా ఉండటం విశేషం.  

Shah Rukh Khan Raj Kumar Hiranis Dunki Trailer Out Now NSK
Author
First Published Dec 5, 2023, 12:56 PM IST

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ (Shah Rukh Khan) రీసెంట్ గా ‘జవాన్’తో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ప్రస్తుతం బాలీవుడ్ సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాని (Raj Kumar Hirani) కాంబోలోని ‘డంకీ’ (Dunki) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘పఠాన్’, ‘జవాన్’ చిత్రంలో వరుసగా బ్లాక్ బాస్టర్ హిట్లను సొంతం చేసుకోవడంతో పాటు హిరాని దర్శకత్వం కావడంతో సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. 

ఇప్పటికే చిత్రం నుంచి డ్రాప్ 1, 2, 3 అంటూ మూడు సార్లు అప్డేట్ ఇచ్చారు. సినిమాపై హైప్ పెంచారు. ఇక తాజాగా డ్రాప్ - 4 వచ్చేసింది. ఈసారి ఫుల్ ఆఫ్ ఎమోషన్స్, షారుఖ్ ఖాన్న తన నలుగురి స్నేహితులను పరిచయం చేస్తూ ట్రైలర్ (Dunki Trailer)ను విడుదల చేశారు. స్నేహం, ప్రేమ, ఫుల్ ఆఫ్ ఎమోషన్స్, యాక్షన్ మిళితంగా ఆకట్టుకుంటోంది. ట్రైలర్ విషయానికొస్తే..  

ట్రైన్‌లో నుంచి షారూక్ తను పుట్టి పెరిగిన ప్రాంతానికి రావడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఆ గ్రామం నుంచి తను, తన నలుగురు స్నేహితుల ప్రయాణం ఎలా సాగిందనేది చెప్పుకొచ్చారు. ఇందులో హార్డి అనే పాత్రలో షారూక్ నటిస్తున్నారు. తన పాత్రతో పాటు షారూక్ స్నేహితులైన మను, సుఖి, బుగ్గు, బల్లి పాత్రలను డంకీ డ్రాప్ 4లో పరిచయం చేశారు. ఈ కథంతా పంజాబ్‌లోని ఓ పల్లెటూరులో జరుగుతుంది. జీవితంలో ఉన్నతంగా ఉండాలనే కోరికతో, తమకు ఇష్టమైన వారు బావుండాలనే ఆశతో వారు లండన్ వెళ్లాలనుకుంటారు. 

పరిస్థితులు అనుకూలించకపోవడంతో బ్యాక్ డోర్ లో విదేశాలకు వెళ్లాలని తలుస్తారు. ఈ ప్రయాణంలో ఐదుగురు స్నేహితులు ఎదుర్కొన్న సవాళ్లు, అసాధారణ పరిస్థితులు వారి జీవితాలను ఎలా మార్చాయనేది భావోద్వేగంగా చూపించారు. హృదయాలను హత్తుకునేలా అంశాలతో ట్రైలర్ విడుదల చేశారు. షారుఖ్ చివర్లో ముసలివాడి పాత్రలో కనిపించడం మరింత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం యూట్యూబ్ లో మంచి వ్యూస్ ను దక్కించుకుంటోంది. 

ఇక  ‘డంకీ’ కేవలం సినిమా మాత్రమే కాదు.. మనల్ని ఓ కొత్త లోకంలోకి తీసుకెళ్లే చక్కటి అనుభూతి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల హృదయాలపై చెరగని ముద్రను వేస్తుంది. డంకీ ఎమోషనల్ రోలర్ కోస్ట్‌లో ప్రయాణించటానికి సిద్ధంగా ఉండండి. మీ కలలు విమానాలలాగా ఆకాశంలోకి ఎగరాలి. స్నేహం విరబూయాలి అనే విషయాలను సినిమా తెలియజేస్తుందని టీమ్ పేర్కొంది. కామెడీ, హృదయాన్ని తాకే అందమైన సన్నివేశాలున్నాయని చెప్పుకొచ్చారు. 

ఈ చిత్రంలో షారుక్ ఖాన్ తోపాటు తాప్సీ పన్ను, బోమన్ ఇరాని, విక్కీ కౌశల్, విక్రమ్ కొచ్చర్, అనీల్ గ్రోవర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఏ జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, రాజ్‌కుమార్ హిరాని ఫిలిమ్స్ సమర్పణలో రాజ్‌కుమార్ హిరాని, గౌరీ ఖాన్ ఈ సినిమాను నిర్మించారు. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 21న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఈమూవీ రిలీజ్ అయిన మరుసటి రోజే ప్రశాంత్ నీల్ - ప్రభాస్ కాంబోలోని Salaar Cease Fire రిలీజ్ అవుతుండటం విశేషం. దీంతో ఇండియన్ ఫిల్మ్స్ లోనే బిగ్ క్లాస్ జరగబోతోంది. ఏ సినిమా నెగ్గుతుందనేది ఆసక్తికరంగా మారింది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios