Asianet News TeluguAsianet News Telugu

షారుఖ్‌ ఖాన్ ఫ్యాన్స్‌కు సర్ ప్రైజ్.. పఠాన్‌ సినిమా నుండి క్రేజీ అప్‌డేట్‌

షారుఖ్ ఖాన్ అభిమానులకు పండగలాంటి వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎప్పుడెప్పుడా అని అందరూ ఎదరు చూపులకు బ్రేక్ వేస్తూ.. షారుక్ సినిమా నుంచి సాలిడ్  అప్ డేట్ రాబోతుంది. 

Shah Rukh Khan Pathaan Movie Teaser Release Date
Author
First Published Oct 20, 2022, 2:06 PM IST

చాలా కాలం అయ్యింది షారుఖ్ ఖాన్ ను సిల్వర్ స్క్రీన్ మీద చూసి. ఆయన ఫుల్ ప్లజ్డ్ గా స్క్రీన్ మీద కనిపిస్తే.. చూసి విజిల్స్ వేయాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఆరటపడుతున్నారు. కాని నాలుగైడేళ్లుగా అది కలగానే మిగిలిపోయింది. ఇక త్వరలో ఫ్యాన్స్  కోరికను తీర్చబోతున్నాడు షారుఖ్ వరుస సినిమాలతో మంచి ఫామ్ లోకి రావాలనిచూస్తున్నాడు. అందులో భాగంగానే ఆయన చేస్తున్న సినిమా పఠాన్. ఈసినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి కూడా చాలా కాలం అవుతోంది. కాని ఈమూవీ నుంచి ఎటువంటి అప్ డేట్ రాకపోవడంతో... ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. 

ఇక రీసెంట్  అందుతున్న సమాచారం ప్రకారం  ఈసినిమాకు  సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. ఈ సినిమా టీజర్‌ను షారుఖ్‌ బర్త్‌డే సందర్భంగా నవంబర్‌ 2న రిలీజ్‌ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే చాన్స్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. దాంతో  షారుఖ్ ఫ్యాన్స్ తెగ సంబర పడుతున్నారు. పండగను ముందుగానే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. తమ అభిమాన హీరోను మళ్లీ చూస్తున్నాం అన్న సంతోషంలో ఎగిరి గంతేస్తున్నారు. 

 షారుఖ్‌ను ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌లో ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు.  దానికి కారణం ఆయన ఇచ్చిన లాంగ్ గ్యాప్. ఇక ఆ గ్యాప్ ను కవర్ చేసేలా.. ప్రస్తుతం షారుఖ్‌ మూడు సినిమాలు సెట్స్‌పైన ఉంచాడు. అందులో పఠాన్ ఒకటి. సిద్ధార్థ్‌ ఆనంద్‌ డైరెక్ట్ చేసిన ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులలో బిజీగా ఉంది. సాధ్యమైనంత త్వరగా ఈమవీని రిలీజ్ చేయాలని ఆరాటపడుతున్నారు మేకర్స్. 

ఇక ఈ సినిమాలో షారుఖ్‌ రా ఏజెంట్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే రిలీజైన పోస్టర్లు, గ్లింప్స్ పఠాన్ సినిమాపై విపరీతమైన క్రేజ్ ను తీసుకువచ్చాయి. టీజర్ తో ఆ అంచనాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇక  ఈ సినిమాలో షారుఖ్ తో పాటు దీపికా పదుకొనే, జాన్‌ అబ్రహం కీలకపాత్రలు పోషిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం రిపబ్లిక్‌ డే సందర్బంగా వచ్చే ఏడాది జనవరి 25న పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజ్‌ చేయనున్నారు. 

షారుఖ్‌ నుండి సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్లయింది. జీరో  సినిమా ప్లాప్ తరువాత  ఇప్పటివరకు ఈయన నటించిన సినిమా రిలీజ్‌ రాలేదు. మధ్యలో కొన్ని సినిమాల్లో గెస్ట్‌ అప్పియరెన్స్‌ ఇచ్చినా.. అవి షారుఖ్ ఫ్యాన్స్‌ను పూర్తిగా సంతృప్తి పరుచలేకపోయాయి.టాలీవుడ్‌ హీరోలకు సమానంగా షారుఖ్‌ఖాన్‌కు తెలుగులో విపరీతమైన క్రేజ్ ఉంది. ఈయన సినిమా రిలీజ్ అవుతందంటే మన టాలీవుడ్ లో కూడా పఠాన్ పై  అంచనాలు పెరిగిపోతున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios