ఆ యాడ్స్ చేయడమేంటి అని ప్రశ్నిస్తూ కొంతమంది ముంబై బాంద్రాలోని షారుఖ్ ఇల్లు మన్నత్ ని ముట్టడించడానికి ప్రయత్నం చేశారు. పోలీసులు ఈ విషయం తెలిసి ఆ ఫౌండేషన్ కి చెందిన సభ్యులని ...
సోషల్ మీడియా రోజులు వచ్చాక ప్రతీ విషయం పెద్ద రచ్చ అయ్యిపోతోంది. ముఖ్యంగా యాడ్స్ విషయంలో ఆచి,తూచి అడుగులు వేయాల్సిన పరిస్దితి వస్తోంది. కోట్లుకు కోట్లు అది ఒకటి,రెండు రోజులు షూట్ చేస్తే వస్తుందని ముచ్చటపడి చేసిన యాడ్స్ రివర్స్ అవుతున్నాయి. ఆ యాడ్స్ పై విమర్శలు వస్తున్నాయి, కోర్టు కేసులు కూడా అయ్యాయి. అయినా తగ్గేదేలే అన్నట్లు స్టార్ హీరోలు మాత్రం ఇవేమి పట్టించుకోకుండా ఎలాంటి యాడ్స్ అయినా చేసుకుంటూ పోతున్నారు. పాన్ మసాలా, ఆన్లైన్ గేమింగ్ యాప్స్, ఆల్కహాల్ లాంటి యాడ్స్ చేసే ముందు ఆలోచించటం లేదు.
తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ చేసిన ఓ యాడ్ ని విమర్శల పాలవుతోంది. ఓ ఆన్లైన్ రమ్మీ గేమింగ్ యాప్(Online Rummy Gaming App) కోసం షారుఖ్ యాడ్ చేసాడు. గతంలో షారూఖ్ చేసిన యాడ్ అయ్యినా రీసెంట్ గా ఆయన ఫామ్ లోకి వచ్చి హిట్ కొట్టడంలో ఆ యాడ్ ప్రమోషన్స్ పెంచారు. ఈ క్రమంలో కొందరి దృష్టి ఈ యాడ్ పై పడింది. ఆన్లైన్ గేమ్స్ వల్ల చాలా మంది యువత డబ్బులు, విలువైన సమయం పోగొట్టుకుంటున్నారనే విషయం లేవనెత్తారు.
దాంతో ఆన్లైన్ గేమింగ్ ని వ్యతిరేకించి, వాటి నుంచి యువతని కాపాడే ఓ NGO సంస్థ అయిన అన్‌టచ్ ఇండియా ఫౌండేషన్ షారుక్ పై ఈ యాడ్ చేసినందుకు విమర్శలు చేసింది. ఒక స్టార్ హీరో హోదాలో ఉంది యువతని పక్కదారి పట్టించే ఇలాంటి ఆన్లైన్ గేమింగ్ యాప్స్ కి యాడ్స్ చేయడమేంటి అని ప్రశ్నిస్తూ ఈ ఫౌండేషన్ కి సంబంధిచిన కొంతమంది ముంబై బాంద్రాలోని షారుఖ్ ఇల్లు మన్నత్ ని ముట్టడించడానికి ప్రయత్నం చేశారు. పోలీసులు ఈ విషయం తెలిసి ఆ ఫౌండేషన్ కి చెందిన సభ్యులని అడ్డుకున్నారు. షారుఖ్ ఇంటి ముందు బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో ఈ సంఘటన వైరల్ గా మారింది.
షారూఖ్ ఖాన్ సినిమాల విషయానికి వస్తే....ఆయన హీరోగా అట్లీ డైరెక్షన్‌లో తెరకెక్కిన మూవీ జవాన్. పఠాన్ తరువాత కింగ్‌ఖాన్‌కి ఈ ఏడాది రెండో సినిమా ఇది. జవాన్ సినిమా కోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీపికా పదుకొణె, నయనతార, విజయ్ సేతుపతి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీ.. సెప్టెంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. హిందీతోపాటు తెలుగు, తమిళంలో కూడా రిలీజ్ చేయనున్నారు.
