కింగ్ ఖాన్ షారుఖ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'జవాన్'. పఠాన్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కావడంతో జవాన్ చిత్రంపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. పైగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది సౌత్ డైరెక్టర్ అట్లీ. దీనితో సౌత్ లో కూడా ఈ చిత్రానికి ఆల్రెడీ క్రేజ్ వచ్చేసింది.
కింగ్ ఖాన్ షారుఖ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'జవాన్'. పఠాన్ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కావడంతో జవాన్ చిత్రంపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. పైగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది సౌత్ డైరెక్టర్ అట్లీ. దీనితో సౌత్ లో కూడా ఈ చిత్రానికి ఆల్రెడీ క్రేజ్ వచ్చేసింది. సెప్టెంబర్ 7న జవాన్ గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ప్రివ్యూ పేరుతో 2 నిమిషాల 12 సెకండ్ల ట్రైలర్ రిలీజ్ చేశారు.
ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు యాక్షన్ డోస్ మాములుగా లేదు. అంతకి మించిన ఎలివేషన్స్ కూడా ఉన్నాయి. షారుఖ్ ఖాన్ తన గురించి తానే చెప్పుకుంటూ బ్యాగ్రౌండ్ లో వాయిస్ ఓవర్ తో ట్రైలర్ సాగుతోంది. నేను ఎవరిని ? నేను ఎవరినీ కాదు,ఏమీ తెలియదు. తల్లి కిచ్చిన మాట కావచ్చు.. నెరవేరని లక్ష్యం కావచ్చు.. నేను మంచి వాడినా చెడ్డ వాడినా.. పుణ్యాత్ముడినా పాపాత్ముడినా.. నీకు నువ్వే తెలుసుకో అంటూ బ్యాగ్రౌండ్ లో కథపై ఆసక్తి పెంచేలా షారుఖ్ తన పాత్రని వివరిస్తున్నారు.
ఇంతలో షారుఖ్ వివిధ గెటప్స్ లో ఉన్న లుక్స్ రివీల్ అవుతూ ఉంటాయి. ఆర్మీ ఆఫీసర్ గా షారుఖ్ క్రేజీగా ఉన్నారు. ఈ లుక్ లో షారుఖ్ ని చూస్తే ఫాన్స్ పిచ్చెక్కిపోవడం ఖాయం. అయితే కంప్లీట్ గా షారుఖ్ ఆర్మీ లుక్ ని రివీల్ చేయలేదు. జస్ట్ టీజ్ చేశారు. ట్రైలర్ చివర్లో షారుఖ్ చెప్పే డైలాగ్ విజిల్స్ కొట్టించే విధంగా ఉంది. నేను విలన్ అయితే నా ముందు ఏ హీరో నిలబడలేడు అంటూ చెప్పే డైలాగ్ అదుర్స్.

ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తోంది. ఆమె కూడా యాక్షన్ సీన్స్ లో నటించింది. అలాగే దీపికా పదుకొనె కామియో రోల్ చేస్తోంది. పఠాన్ చిత్రంలో యాక్షన్ బీభత్సం సృష్టించిన షారుఖ్ జవాన్ లో అంతకి మించిన సునామి సృష్టించబోతున్నట్లు ట్రైలర్ తో అర్థం అవుతోంది. దర్శకుడు అట్లీ నెవర్ బిఫోర్ అనే విధంగా యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేసినట్లు ఉన్నారు. ఎక్కువగా ఈ చిత్రం నైట్ మోడ్ లోనే ఉన్నట్లు ఉంది. షారుఖ్ కథలో ఆర్మీ అధికారిగా ఉండి విలన్ గా మారతాడా లేక మిషన్ లో భాగంగా వివిధ గెటప్స్ లో కనిపిస్తున్నారా అనేది ఉత్కంఠ రేపుతోంది. చివరలో షారుఖ్ గుండుతో కనిపించడం సర్ప్రైజ్.
బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్ చేసే విధంగా ఉంది. ఈ చిత్రాన్ని షారుఖ్ సతీమణి గౌరి ఖాన్ నిర్మిస్తున్నారు. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.
