Asianet News TeluguAsianet News Telugu

హాఫ్ సెంచరీ కొట్టిన జవాన్ మూవీ, 50 రోజుల్లో షారుఖ్ ఎంత వసూలు చేశాడంటే..?

రీ ఎంట్రీతో రఫ్పాడించేస్తున్నాడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. ఏమాత్రం తగ్గేది లేదంటున్నాడు. రెండు సినిమాలు ఒక్కో సినిమా వెయ్యి కోట్లకు పైనే కలెక్ష్ చేశాయి. దాంతో బాలీవుడ్ కు ఊపిరి వచ్చింది. ఇక బాద్ షా జవాన్ సినిమా తాజాగా 50 రోజులు  పూర్తి చేసుకుంది. మరి ఈసినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే..? 

Shah Rukh Khan Jawan Movie Completed 50 days and Collection Update JMS
Author
First Published Oct 28, 2023, 10:17 AM IST

రీ ఎంట్రీతో రఫ్పాడించేస్తున్నాడు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్. ఏమాత్రం తగ్గేది లేదంటున్నాడు. రెండు సినిమాలు ఒక్కో సినిమా వెయ్యి కోట్లకు పైనే కలెక్ష్ చేశాయి. దాంతో బాలీవుడ్ కు ఊపిరి వచ్చింది. ఇక బాద్ షా జవాన్ సినిమా తాజాగా 50 రోజులు  పూర్తి చేసుకుంది. మరి ఈసినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే..? 

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌ నటించిన‌ తాజా యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ జవాన్‌. తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ  దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా  సెప్టెంబ‌ర్ 7న ప్రపంచ వ్యాప్తంగా  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వచ్చీ రావడంతోనే  బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుందీ సినిమా. ఇప్ప‌టి వ‌ర‌కు జవాన్ దాదాపుగా 1150 కోట్లకు పైగా కలెక్ట్‌ చేసి బాలీవుడ్‌ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది. వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బందిపడ్డ షారుఖ్.. రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత వరుసగా వెయ్యికోట్లు కలెక్ట్ చేసిన రెండో సినిమా ఇది. ఇక ఈ ఏడాది పఠాన్‌తో వెయ్యి కోట్లు కొల్లగొట్టిన షారుఖ్‌.. జవాన్‌తో పఠాన్‌ రికార్డులను పక్కకు నెట్టేశాడు. తన రికార్డ్స్ తానే బ్రేక్ చేసుకున్నాడు. 

ఇక ఇదిలా ఉంటే.. అసలు విషయం ఏంటంటే...? తాజాగా జవాన్ సినిమా  50 రోజులు పూర్తి చేసుకున్న‌ట్లు ద‌ర్శ‌కుడు అట్లీ ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలిపాడు. దీనితో పాటు ఒక స్పెష‌ల్ నోట్ ను కూడా పోస్ట్ చేశాడు. జవాన్  సినిమా మీ ముందుకు వచ్చి 50 రోజులవుతోంది. ఈ మూవీ వ‌చ్చి 50 రోజులు గడిచినా ఇప్పటికీ  కొన్ని లక్షల మంది హృదయాలను గెలుచుకుంటుంది. ప్రపంచమంతా జవాన్ హవా కనిపిస్తూనే ఉంది అంటూ అట్లీ తన నోట్ లో రాశారు. . దీనితో పాటు 50రోజులకు సబంధించిన  ఒక పోస్ట‌ర్‌ను కూడా విడుద‌ల చేశాడు. 

 

ఇక 50 రోజులు అవుతున్నా..  ఇంకా జవాన్ హవా కొనసాగుతూనే ఉంది.  50వ రోజు కూడా సుమారు 11లక్షల వరకూ వసూలు చేసిందీ సినిమా ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో షారుక్‌ సరసన సౌత్ లేడీ సూపర్ స్టార్  నయనతార నటించగా..తమిళ స్టార్ యాక్టర్  విజయ్‌ సేతుపతి.. బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొణె , ప్రియమణి , సునీల్‌ గ్రోవర్‌ , సాన్య మల్హోత్ర , యోగిబాబు లాంటి స్టార్స్ నటించి మెప్పించారు. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో నవంబర్ 2నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. అంతేకాదు.. ఓటీటీ రిలీజ్ లో.. సెన్సార్ లో కట్ అయిన సీన్స్ ను కూడా యాడ్ చేసి రిలీజ్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios