భారీ ఎత్తున రిలీజ్ కు రెడీ అవుతోంది షారుఖ్ ఖాన్ జవాన్ మూవీ. ఈసారి సౌత్ ను కూడా టార్గెట్ చేశాడు బాలీవుడ్ బాద్ షా ఈక్రమంలో ఈమూవీ గురించి ఓ క్రేజీ బజ్ వైరల్ అవుతోంది. 

బాలీవుడ్ స్టార్ హీరో.. కింగ్ కాంగ్ షారుఖ్ ఖాన్ సినిమా అంటే అటు బాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉంటుందో అందరికి తెలిసిందే. సౌత్ లో కూడా ఆయనకు ఫాలోయింగ్ భారీ స్థాయిలో ఉంది. అయితే ఈసారి సౌత్ ఆడియన్స్ ను గట్టిగా టార్గెట్ చేస్తు ఆయన చేసిన సినిమా జవాన్. సౌత్ డైరెక్టర్ అట్లీతో.. సౌత్ హీరోయిన్ నయనతార జంటగా.. సౌత్ స్టార్ విజయ్ సేతుపతి కాంబినేషన్ లో.. షారుఖ్ గట్టిగా ప్లాన్ చేశాడు. ఈమూవీ ద్వారా పఠాన్ రికార్డ్స్ ను బ్రేక్ చేయాలని చూస్తున్నాడు. 

అంతే కాదు ఈ ముగ్గరు స్థార్లు తమిళవాళ్లు కావడంతో.. బాలీవుడ్ తరువాత తమిళంలోనే ఈమూవీకి డిమాండ్ గట్టిగా కనిపిస్తోంది. అంతే కాదు ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితుడైన అట్లీతో జవాన్‌ చేస్తుండటంతో ఈ సినిమాపై వీర లెవల్లో అంచనాలున్నాయి. ఈ సినిమాతో కేవలం సౌత్‌లోనే షారుఖ్‌కు 200 కోట్లకు పైగా వసూలు అవుతందన్న నమ్మకంతో ఉన్నారు. ఈక్రమంలో సినిమా రిలీజ్ దగ్గరలో ఉండటంతో.. ప్రమోషన్ల విషయంలో జోరు చూపిస్తున్నారు స్టార్స్. ఈక్రమంలో జవాన్ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతోంది. అందేంటంటే...? 

జవాన్ మూవీకి ఆరుగురు స్టంట్ మాస్టర్‌లు పనిచేశారన్న న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. మాములుగా ఇండియాన్‌ సినిమాలకు ఒకరిద్దరు మాత్రమే యాక్షన్‌ సీన్లు కొరియోగ్రఫి చేస్తుంటారు. కానీ తొలిసారి జవాన్‌ సినిమాకు ఏకంగా ఆరగురు యాక్షన్ కొరియోగ్రఫర్స్ పనిచేశారన్న న్యూస్ హైలెట్ అవుతోంది. ఈ విషయం అందరనీ ఆశ్చర్యంలో పడేసింది. వాళ్లు కూడా చిన్న చిన్న వారు కాదట. స్పైరో రజటోస్, యాన్నిక్ బెన్, క్రెయిన్ మ్యాక్రే, కెచా ఖంఫ్కాడె, సునీల్ రోడ్రిగ్స్, అనల్ అరసు వంటి వరల్డ్‌క ఫేమస్.. అవార్డ్ విన్నింగ్ స్టంట్స్‌ మాస్టర్‌లు ఈ సినిమాకు యాక్షన్‌ సన్నివేశాలను కంపోజ్ చేశారని సమాచారం. 

ఇక హిందీలో బ్యాక్‌ టు బ్యాక్‌ ప్రమోషన్‌లు ప్లాన్ చేస్తూ.. సినిమాపై జనాల్లో హైప్‌ ఎక్కిస్తున్నారు టీమ్. ఇక తమిళంలో వచ్చే వారంలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను కూడా భారీ ఎత్తును చేయాలని ప్లాన్ చేశారట. ఈ ఈవెంట్ కు పెద్ద పెద్ద స్టార్‌లను గెస్ట్‌లుగా పిలవనున్నారట. అదే వేడుకలో మరో ట్రైలర్‌ను రిలీజ్‌ చేస్తారని అంటున్నారు. . ఇప్పటికే రిలీజైన టీజర్‌, పాటలు గట్రా సినిమాపై ఓ రేంజ్‌లో హైప్‌ క్రియేట్‌ చేశాయి. అప్పుడే బాలీవుడ్‌ ట్రేడ్‌ షారుఖ్‌కు ఈ సినిమా మరో వెయ్యి కోట్ల బొమ్మవుతుందని అంచనా కూడా వేసేశారు. మరో పదిహేను రోజుల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను పూర్తి చేసుకుంది. ప్రమోషన్‌ల స్పీడ్‌ కూడా పెంచేసింది. 

ఇక ఈసినిమా కోసం దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఎదరు చూస్తున్నారు. రెడ్ చిల్లీస్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో షారుఖ్‌కు జోడీగా లేడీ సూపర్ స్టార్ నయనతార నటిస్తుంది. దీపికా పదుకొనే గెస్ట్‌ రోల్‌ చేయగా.. తమిళ విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి షారుఖ్ విలన్ గా కనిపించనున్నాడు. అనురుధ్ స్వరాలందించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 7న హిందీ, తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజవుతుంది.