స్టార్స్ అంటే ప్రాణం ఇస్తుంటారు అభిమానులు. తమకు ప్రాణ సమానమైన తారలు కనిపిస్తే చాలు.. పట్టేసుకోవాలని.. ముద్దులు పెట్టేసుకోవాలని ప్రయత్నిస్తుంటారు..
తమ అభిమాన తారలు కనిపిస్తే చాలు.. ఫ్యాన్స్ దిల్ ఖుష్ అవుతుంటారు. ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతూ..సందడి చేస్తుంటారు. వారి వెంట పడి మరీ.. ఫొటోలు,సెల్ఫీలు, ఆటోగ్రాఫ్ లు అంటూ హడావిడి చేస్తుంటారు. ఇక అభిమానం కాస్త పిచ్చిగా మారిన మరికొందరైతే ఒళ్లు తెలియకుండా ప్రవర్తిస్తుంటారు. స్టార్ల మీదకు వెళ్ళి.. పిచ్చిపిచ్చిగా ప్రవర్థిస్తుంటారు. హగ్ చేసుకోవడం వంటివి చేస్తుంటారు.
తాజాగా బాలవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కు అలాంటి అనుభవంమే ఎదురయ్యింది. ఓ యువతి షారుఖ్ ను గట్టిగా హగ్ చేసుకుని ముద్దు పెట్టేసింది. బాద్ షాను అందరి ముందూ ముద్దు పెట్టుకుంది. షారుక్ ఖాన్ రీసెంట్ గా ఓ కార్యక్రమం కోసం దాబాయ్ వెళ్లాడు. అక్కడికి వచ్చిన కొందరు ఫ్యాన్స్ తో ఈ బాద్ షా సరదాగా కాసేపు ముచ్చటించాడు. వారితో సెల్ఫీలు, ఫొటోలు దిగాడు.
సరిగ్గా అదే టైమ్ కి అక్కడున్న ఓ యువతి షారుక్ కు షాక్ ఇచ్చింది.ఆయన్ను చూసి అత్యుత్సాహం ప్రదర్శించింది. అందరి ముందూ షారుక్ బుగ్గపై గట్టిగా ముద్దు పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు .. షారుఖ్ ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆ అమ్మాయిపై ఫైర్ అవుతున్నారు. ఆ యువతిని జైల్లో వేయాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు.
ఇక బాలీవుడ్ కు దాదాపు 4 ఏళ్లు గ్యాప్ ఇచ్చిన షారుఖ్ వరుస ఫెయిల్యూర్స్ తో కుంగిపోుయాడు. దాంతో.. తాజాగా పఠాన్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన స్టార్ హీరో.. ప్రస్తుతం తమిళ డైరెక్టర్ అట్లీతో.. జవాన్ సినిమా చేస్తున్నాడు. ఈసినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.
