. ఇతర భాషల్లో డబ్బింగ్ చేయకుండా కేవలం ఒక సింగల్ లాంగ్వేజ్ డిజిటల్ రైట్స్ కి ఇంత రేట్ పలకడం ఇదే తొలిసారి. హిందీ వెర్షన్ మాత్రమే ఈ రేట్ కి డీల్ చేశారు. 


సినిమా ప్రారంభం అవగానే ముందు ఓటిటి రైట్స్ ఎంతో లెక్కేసుకుంటున్నారు భారి నిర్మాతలు. అందుకు తగ్గట్లుగానే క్రేజీ కాంబో అంటే ఓటిటి సంస్దలు ఎగబడుతున్నాయి. అయితే ప్రతీదానికి ఓ రీజనబుల్ రేటు ఉంటుంది కానీ ఇంత పెద్ద మొత్తంలో ఓటిటి రైట్స్ రావటం మాత్రం తొలిసారి అంటున్నారు. ఏ సినిమాకు అంటున్నారా... వివరాల్లోకి వెళితే...

కొన్నేళ్ల విరామం తర్వాత షారూఖ్‌ఖాన్‌ నటించిన ‘పఠాన్‌’బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీని తర్వాత ఆయన తమిళ దర్శకుడు అట్లీతో, స్టార్ బాలీవుడ్ డైరక్టర్ రాజ్‌కుమార్‌ హిరాణితో చేస్తున్న సినిమాలు ఫినిష్ చేసే పనిలో పడ్డారు. రాజ్‌కుమార్‌ హిరాణి తో చేస్తున్న సినిమాకు ‘డుంకీ’ అనే టైటిల్‌ను ఖరారు చేసారు. తాప్సీ పన్ను లీడ్‌రోల్‌లో నటిస్తున్నారు.ఈ ఏడాది క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబరు 22న సినిమాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. 

ఈ సోషల్ ఎంటర్ టైనర్ లో షారుఖ్ ని ఇంతకు ముందు ఎప్పుడూ చూడని పాత్రల్లో చూపబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు రాజ్ కుమార్ హిరాణీ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వినోదంతో పాటు హృదయాలను తాకే అంశాలు, ఆలోచింపజేసే విషయాలతో సినిమాలు తెరకెక్కిస్తారు. అంతేకాదు రాజ్ సినిమాలు బ్లాక్ బస్టర్స్‌గా రికార్డు సృష్టిస్తాయి. బాలీవుడ్ బాద్ షా ‘షారూఖ్ ఖాన్‌’‌ హీరోగా ఆయన ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తామిద్దరి కాంబినేషన్‌లో త్వరలోనే సినిమా రాబోతున్నట్లు షారుఖ్ ఇప్పటికే ప్రకటించారు.ఈ నేపధ్యంలో సినిమాకు ఓ రేంజిలో క్రేజ్ కియేట్ అయ్యింది. 

 ఓటిటి హక్కుల కోసం జియో సినిమా అక్షరాలా 155 కోట్లు చెల్లించిందని మీడియా టాక్. ఇతర భాషల్లో డబ్బింగ్ చేయకుండా కేవలం ఒక సింగల్ లాంగ్వేజ్ డిజిటల్ రైట్స్ కి ఇంత రేట్ పలకడం ఇదే తొలిసారి. హిందీ వెర్షన్ మాత్రమే ఈ రేట్ కి డీల్ చేశారు. 2024 ప్రారంభంలోనే స్ట్రీమింగ్ జరిగే ఛాన్స్ ఉంది. ఓటిటి రంగంలో పరుగెత్తాలనే లక్ష్యంతో గత మూడు నెలలుగా కొత్త సినిమాలను వరసబెట్టి రిలీజ్ చేస్తున్న జియో సినిమాకు డుంకీ అతి పెద్ద బూస్ట్ అవుతుందని అంచనా. 2018 సంజు వంటి సూపర్ హిట్ తర్వాత ఆరేళ్ళ గ్యాప్ తీసుకుని రాజ్ కుమార్ హిరానీ తీసిన మూవీ కావడంతో ఆడియన్స్ లో ఖచ్చితంగా ఎగ్జైట్ మెంట్ ఓ రేంజ్ లో ఉంది. 

జియో స్టూడియోస్‌, రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, రాజ్‌కుమార్‌ హిరాణి ఫిల్మ్స్‌ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అయితే, ఈ సినిమాకి రాఘ‌వేంద్ర‌రావు మాజీ కోడ‌లు క‌నిక థిల్లాన్ స్క్రిప్టు రాసింది.