Asianet News TeluguAsianet News Telugu

#Dunki:షారూఖ్ ‘డంకీ’OTT రిలీజ్ డేట్, స్ట్రీమింగ్ పార్టనర్

 ‘ప‌ఠాన్‌’, ‘జ‌వాన్‌’ లాంటి మాస్ మసాలా, యాక్ష‌న్ సినిమాల త‌ర్వాత షారుక్‌ని ఇలాంటి సున్నిత‌మైన క‌థ‌లో చూపించారు. ఆయ‌న న‌ట‌న‌ని మ‌రో కోణంలో ఆవిష్క‌రించిందీ చిత్రం.

Shah Rukh Khan Dunki OTT streaming date and release partner jsp
Author
First Published Feb 8, 2024, 9:47 AM IST


బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్(Shahrukh Khan), స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీతో  కాంబినేషన్ లో రూపొంది విడుదలైన చిత్రం  ‘డంకీ’.ఈ సినిమా పై దేశ వ్యాప్తంగా మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నా  క్యాష్ చేసుకోలేకపోయిందనే చెప్పాలి.  ఆర్ధ్ర‌త నిండిన సామాజికాంశాలు.. హ‌త్తుకునే భావోద్వేగాలు.. అదే స్థాయి హాస్యంతో క‌ట్టిప‌డేసే ద‌ర్శ‌కుడు రాజ్‌కుమార్ హిరాణీ ఈ సారి తడబడ్డాడు. ఈసారి కూడా ఆ అంశాల‌కి ఏమాత్రం లోటు చేయకుండా ‘డంకీ’ని తెర‌కెక్కించాలనకున్నా ఆ ఎలిమెంట్స్ వర్కవుట్ కాలేదు. సూప‌ర్‌స్టార్‌ షారుక్‌ ఖాన్ స్థాయి మాస్‌కి, ఆయ‌న మార్క్ రొమాంటిక్ ఇమేజ్‌ ఈ సినిమా భిన్నంగా ఉండటంతో చాలా మందికి నచ్చలేదు. అయితే ఫ్యాన్స్ ని మినహాయిస్తే  షారూఖ్ సినిమాని ఒకసారైనా చూడాలనుకున్న వాళ్లు మాత్రం ఓటిటి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ఓటిటి రిలీజ్ డేట్ బయిటకు వచ్చింది.

అందుతున్న సమాచారం మేరకు ఈ చిత్రాన్ని జియో సినిమా ఓటిటి వాళ్లు రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రం పిబ్రవరి 16 న ఓటీటిలో స్ట్రీమింగ్ కాబోతోంది.  న‌వ్విస్తూ, హృద‌యాలను బ‌రువెక్కిస్తూ, సాహ‌సోపేత‌మైన డంకీ ప్ర‌యాణంలో ప్రేక్ష‌కుల్ని భాగం చేస్తామంటూ ఈ సినిమా ఓటిటిలో రాబోతోంది.  

చిత్రం కథేమిటంటే...

పంజాబ్‌లోని ఓ చిన్న విలేజ్ కు చెంచిన  మ‌న్ను (తాప్సి), సుఖి (విక్కీ కౌశ‌ల్‌), బుగ్గు (విక్ర‌మ్ కొచ్చ‌ర్‌), బ‌ల్లి (అనిల్ గ్రోవ‌ర్‌).. లో ఎవరికి తగ్గ సమస్యలు వాళ్లకు ఉంటాయి.ఈ స్నేహితుల జీవితాశయం,కల ఒకటే..వాళ్లంతా ఇంగ్లాండ్ వెళ్లాలని. వాళ్ల సమస్య ఏమిటంటే... టిక్కెట్,వీసా . అయితే వాళ్ల కల నేర్చవేటానికి  ఓ సైనికుడు ముందుకు వస్తాడు. తను ఇంగ్లాండ్ చేరుస్తానని మాట ఇస్తాడు. అక్కడ నుంచి జరిగే జర్ని,బోర్డర్ సమస్యలు, స్నేహం, కుటుంబం పట్ల ప్రేమ, విలువలు చుట్టు తిరుగుతుంది. సవ్యంగా వీసా, పాస్ పోర్ట్ వచ్చేసి వెళ్తే ఏ తిప్పలూ ఉండవు. కానీ వారు వేరే మార్గం ఎంచుకుంటారు. అక్రమ ప్రయాణంలో వారు ప్రయాణం పెట్టుకుంటారు. అదెలా ఎలా ఏమిటి..అనేది ఫన్ తో కూడిన సీన్స్ తో సినిమా ఉండనుంది. డంకీ అంటే దేశ సరిహద్దుల వెంట అక్రమ ప్రయాణం గురించి వివరించే మార్గము.
  
ఈ చిత్రంలో తాప్సీ పన్ను, బోమన్ ఇరానీ, విక్రమ్ కొచ్చర్, అనిల్ గ్రోవర్ కీలక పాత్రల్లో నటించారు. విక్కీ కౌశల్ ప్రత్యేక పాత్రలో కనిపించారు.  ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్ హిరానీ ఫిలిమ్స్, రెడ్ ఛిల్లీస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, జియో స్టూడియో బ్యానర్లపై రాజ్‌కుమార్ హిరానీ, గౌరీఖాన్‌ సంయుక్తంగా నిర్మించారు.  ఈ మూవీకి అభిజాత్‌ జోషి, రాజ్‌కుమార్ హిరానీ, కనికా ధిల్లాన్‌ కథ అందించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios