కింగ్ ఖాన్ బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan)కు కోట్లలో ఫ్యాన్స్ ఉంటారు. తన అప్ కమింగ్స్ ఫిల్మ్స్ పై ఎంతగానో ఎదురు చూస్తుంటారు. అయితే తన రాబోయే చిత్రం గురించి ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ఎస్ఆర్ కే క్రేజీ రిప్లై ఇచ్చారు.
షారుఖ్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం పఠాన్ (Pathaan). చిత్రం కోసం ఎస్ఆర్కే ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారంటే మాటల్లో చెప్పడం కష్టం. అయితే ఈ మూవీకి సంబంధించి టీజర్ తాజాగా రిలీజ్ అయ్యింది. దేశభక్తిని సూచించే విధంగా ఉన్న ఈ టీజర్ లో జాన్ అబ్రహం, దీపికా పదుకునే (Deepika Padukone), షారుఖ్ ఖాన్ నటిస్తున్నారు. అయితే ఈ మల్టీ స్టార్ మూవీకి సంబంధించిన టీజర్ లో జాన్ అబ్రహం, దీపికా పదుకునే లుక్స్ ఎలా ఉండబోతోందో చూపించారు. కానీ షారుఖ్ ఖాన్ లుక్ ను మాత్రం చూపించలేదు. ఇందుకు కింగ్ ఖాన్ ఫ్యాన్స్ కొంత హర్ట్ అయ్యారు. అయితే టీజర్ రిలీజ్ తర్వాత షారుఖ్ ఖాన్ ట్వీట్టర్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. దీంతో ఒక అభిమాని ‘మీ ఫస్ట్ లుక్ ను ఎప్పుడు విడుదల చేస్తారు’ అని అడిగాడు. పఠాన్ మూవీని ఉద్ధేశించిన అడిగిన ఈ ప్రశ్నకు షారుఖ్ ఖాన్ క్రేజీ రిప్లై ఇచ్చారు. ‘నేను 32 సంవత్సరాల నుండి ఒకేలా కనిపిస్తున్నాను..హ హ.. లుక్ ఏముంది.. నా అందమైన రూపం ఎప్పుడూ ఒకటే’ అంటూ బదులిచ్చాడు. ఏదేమైనా షారుఖ్ ఖాన్ ఎలా బదులిచ్చినా ఫ్యాన్స్ ఖుషీ అవుతూనే ఉంటారు. కానీ ఇలా స్పందించడంతో పలువురు నెటిజన్లు ఒక్కో సినిమాలో ఒక్కో గెటప్ లో కనిపించారు కదా అంటూ షారుఖ్ ఖాన్ కు సంబంధించిన పలు సినిమాల పోస్టర్లను పోస్ట్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ మూవీలో షారుఖ్ ఖాన్ గెటప్ పై ఇప్పటికే ప్రేక్షకుల్లో చాలా ఆసక్తి నెలకొని ఉంది. లాంగ్ హెయిర్, రఫ్ లుక్ లో ఢిపరెంట్ గా కనిపించబోతున్నట్టు కొద్ది రోజులుగా నెట్టింట చర్చ జరుగుతోంది. ఇటీవల షారుఖ్ ఖాన్ నెక్ట్స్ మూవీ లుక్ అంటూ లాంగ్ హెయిర్ తో ఉన్న ఫొటోను తెగ షేర్ చేశారు నెటిజన్లు. ‘పఠాన్’మూవీని 2023 జనవరి 25న రిలీజ్ చేసేందుకు షెడ్యూల్ చేశారు. ఈ మూవీని యష్ రాజ్ ఫిల్మ్ నిర్మిస్తోంది.
