Asianet News TeluguAsianet News Telugu

‘డంకీ’టీజర్ వచ్చేసింది, 'సలార్' ని ఢీ కొలదా? తేలిపోయింది


మున్నాభాయ్ ఎం.బీ.బీ.ఎస్ (Munnabhai MBBS). లాగేరహో మున్నాభాయ్ (Lageraho Munnabhai), త్రీ ఇడియట్స్ (3 Idiots), పీకే (PK), సంజు (Sanju) వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల తీసిన రాజ్‌కుమార్ హిరానీ

Shah Rukh Khan birthday special surprise Dunki teaser jsp
Author
First Published Nov 2, 2023, 12:20 PM IST


సినిమా లవర్స్ అందరి దృష్టీ ఇప్పుడు ప్రతిష్టాత్మక చిత్రాలైన సలార్, డంకీ పైనే ఉంది. ఒక రోజు తేడాలో రిలీజ్ కానుండటంతో ఈ సినిమాలను పోటీగానే భావిస్తున్నారు అబిమానులు. దాంతో ఈ చిత్రాల ప్రమోషన్ మెటీరియల్ ని బట్టి సినిమాల మధ్య. పోటీ ఏ స్దాయిలో ఉండబోతోందో అంచనా వేయబోతున్నారు. ఈ క్రమంలో బాక్సాఫీస్ దగ్గర సూపర్ ఫైట్ తప్పేలా కనిపించడం లేదు.  తాజాగా ఈ పోటీ ఎలా ఉండబోతోందో శాంపిల్ చూపించబోతూ డంకీ టీజర్ రిలీజ్ చేసారు. 

ఈ టీజర్ ..పూర్తి రాజ్ కుమార్ హిరాని టైప్ లో నడుస్తోంది. వరసగా రెండు యాక్షన్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన షారూఖ్ ఈ సినిమాలో ఫన్, హ్యూమన్ ఎమోషన్స్ తో తన అభిమాలను ఓ రేంజిలో అలరించున్నారు. మీరు ఓ లుక్కేయండి ఈ సినిమా సలార్ ఏ రేంజి పోటీ ఇవ్వబోతోందో అర్దమవుతుంది. 

మున్నాభాయ్ ఎం.బీ.బీ.ఎస్ (Munnabhai MBBS). లాగేరహో మున్నాభాయ్ (Lageraho Munnabhai), త్రీ ఇడియట్స్ (3 Idiots), పీకే (PK), సంజు (Sanju) వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల తీసిన రాజ్‌కుమార్ హిరానీ (Rajkumar Hirani) ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. తాప్సీ (Tapsee) హీరోయిన్ గా న‌టిస్తుంది.   మరో ప్రక్క బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌ (Shah Rukh Khan). ప‌ఠాన్ (Pathaan), ‘జవాన్‌’ (Jawan) సినిమాల‌తో ఈ సంవ‌త్స‌రం బ్యాక్ టూ బ్యాక్ హిట్లు అందుకున్నాడు. 
 
 జ‌న‌వ‌రిలో వ‌చ్చిన ప‌ఠాన్ సినిమా రూ.1000 కోట్ల‌కు పైగా క‌లెక్ష‌న్లు సాధించగా.. రీసెంట్‌గా విడుద‌లైన ‘జవాన్‌’ (Jawan) సినిమా వరల్డ్‌ వైడ్‌గా రూ.1140 కోట్లు కొల్లగొట్టింది. ఇక ఈ చిత్రంలో షారుఖ్‌ నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. షారుఖ్‌కి ​​ఇది వరుసగా మూడో బ్లాక్ బ‌స్ట‌ర్ (హ్యాట్రిక్) అవుతుంద‌ని అన్నారు. అలాగే డంకీ కామెడీతో పాటు మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది. మీరు దీన్ని ఎంజాయ్ చేస్తారు.. అంటూ అంటున్నారు. కాగా ప్ర‌స్తుతం ఈ టీజర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios