యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’. చాలా కాలం క్రితం ప్రారంభమైన ఈ చిత్రం కొన్ని నెలలుగా రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ ను జరుపుకుంటుంది. ‘రన్ రాజా రన్’ ఫేమ్ సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఆగష్టు 15న తెలుగు , హిందీ , తమిళ భాషల్లో భారీ స్థాయిలో విడుదలకానుంది. 

చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా ఆ మధ్యన ఈ చిత్రం యొక్క షేడ్స్ అఫ్ సాహో చాప్టర్ 1 ను విడుదలచేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.  తాజాగా షేడ్స్ అఫ్ సాహో చాఫ్టర్ 2 ను శ్రద్ధ కపూర్ బర్త్ డే సందర్భగా మార్చి 3 న విడుదలచేయనున్నారని తెలుస్తోంది.

యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న  ఈ చిత్రంలో ప్రభాస్‌కి జోడీగా శ్రద్ధా కపూర్‌ నటిస్తోంది.  నీల్ నితిన్ ముఖేష్, చుంకీ పాండే, జాకీ ష్రాఫ్, టిన్ను  ఆనంద్, మందిరా బేడీ వంటి పలువురు హిందీ నటులు ఇందులో నటిస్తున్నారు.

దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కేవలం యాక్షన్‌ సన్నివేశాల కోసమే రూ.40 కోట్ల వరకు కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ సినిమా తో పాటు  ప్రభాస్‌ జిల్  రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్నారు.