రన్ బీర్ ఊపిరి తీసుకోనివ్వలేదు: షబనా ఆజ్మీ

shabana azmi about sanju movie
Highlights

బాలీవుడ్ హీరో సంజయ్ దత్ జీవితం ఆధారంగా 'సంజు' అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే

బాలీవుడ్ హీరో సంజయ్ దత్ జీవితం ఆధారంగా 'సంజు' అనే సినిమా రూపొందిన సంగతి తెలిసిందే. రన్ బీర్ కపూర్ నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు అన్ని చోట్ల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అభిమానులతో పాటు బాలీవుడ్ ప్రముఖులు కూడా ఈ సినిమా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

తాజాగా నటి షబనా అజ్మీ కూడా ఈ సినిమాపై స్పందించింది. 'రన్ బీర్ జీవితంలో ఇది అద్భుతమైన సినిమా అవుతుంది. తన యాక్టింగ్ చూసి ఒక్క క్షణం ఊపిరి తీసుకోవడం మర్చిపోయాను. అంత చక్కటి పెర్ఫార్మన్స్ కనబరిచాడు' అంటూ రన్ బీర్ కపూర్ తండ్రి రిషి కపూర్ ట్యాగ్ చేసి ఓ పోస్ట్ పెట్టారు. తన కొడుకుపై కురిపిస్తోన్న అభినందలను ఆయన ఎంతో సంతోషంగా స్వీకరించారు. 

 

 

loader