Asianet News TeluguAsianet News Telugu

"శభాష్‌ మిథు" రిలీజ్ డేట్ ఫిక్స్! విడుద‌ల ఎప్పుడంటే?

లేడీ క్రికెటర్ మిథాలీ రాజ్ జీవితం ఆధారంగా శభాష్‌ మిథు అనే చిత్రం తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రం లీడ్ రోల్ లో తాప్సీ న‌టిస్తోంది. ఇవాళ మిథాలీ రాజ్ బ‌ర్త్డే సంద‌ర్భంగా ఈ సినిమా రిలీజ్ తేదీని ప్ర‌క‌టించారు మూవీ మేక‌ర్స్.
 

Shabaash Mithu release date
Author
Hyderabad, First Published Dec 3, 2021, 7:35 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ప్ర‌స్తుతం సినీ ఇండ్ర‌స్టీలో బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ, క్రీడా కారుల జీవితాల ఆధారంగా బయోపిక్స్ తెర‌కెక్కాయి సినీ నిర్మాత‌లు. అనూహ్య విజ‌యాల‌ను సాధించారు. వీటిలో స్పోర్ట్‌ స్టార్స్ బయోపిక్స్‌కు ఎలాంటి ఆద‌ర‌ణ ఉంటుందో ప్ర‌త్యేకంగా  చెప్ప‌వ‌ల్సిన అవ‌స‌రం లేదు. అందులోనూ.. క్రికెటర్స్ బయోపిక్స్ అంటే ..  ఆ సినిమాల‌కు క్రేజ్ మాములుగా ఉండ‌దు. 


ఆ సినిమాలు క‌చ్చితంగా సూప‌ర్ బూప‌ర్ హిట్టే.. ఇప్ప‌టికే.. సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ ల బ‌యోపిక్ లు సూప‌ర్ స‌క్సెస్  సాధించాయి. త్వ‌ర‌లోనే టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌ దేవ్ లైఫ్ స్టోరీని బేస్ చేసుకుని ఇండియా విక్టరీ 83 పేరుతో సినిమా రానున్న‌ది. అలాగే .. వ‌న్డే స్పెష‌లిస్ట్  బ్యాట్స్ మెన్  యువ‌రాజ్ సింగ్, టీమిండియా మాజీ కెప్టెన్, రన్నింగ్‌ మిషెన్ విరాట్‌ కోహ్లీపై కూడా బయోపిక్ రాబోతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.

Read Also: https://telugu.asianetnews.com/entertainment/nandamuri-balakrishna-akhanda-movie-us-box-office-collections-r3htz1

బ‌యోపిక్స్ ప‌ట్ల ప్రేక్ష‌కులు అధికంగా ఆస‌క్తి చూపుతుండ‌టంతో .. దీన్ని సొమ్ము చేసుకోవ‌డానికి ద‌ర్శ‌క నిర్మాత‌లు ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు. తాజాగా టీమిండియా విమెన్ క్రికెట‌ర్ మిథాలీరాజ్ జీవిత క‌థ ఆధారంగా బ‌యోపిక్ రాబోతుంది. శ్రీ‌జిత్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి శ‌భాష్ మిథు పేరు ఖ‌రారు చేశారు . ఈ చిత్రాన్నివ‌యా కామ్ 18 స్టూడియోస్ నిర్మిస్తోంది. స్పోర్ట్స్ డ్రామా నేప‌థ్యంలో  తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ప్ర‌ముఖ న‌టి తాప్సీ ప‌న్ను టైటిల్ పాత్ర‌లో పోషిస్తోంది.

ఈ బ‌యోపిక్ లో ఓ సాధార‌ణ యువ‌తి ఎన్నో ఆటు పోట్లు ఎదుర్కొని భార‌తీయ మ‌హిళ‌ క్రికెట్ జ‌ట్టులో స్థానం సంపాదించుకుంది. ఎన్నో ఒడిదొడుకుల‌ను అధిగ‌మించి ప్ర‌పంచ వ్యాప్తంగా ఎలా పేరు సంపాదించుకున్న‌ద నే ప్ర‌యాణాన్ని చూపిస్తింద‌న్నారు ద‌ర్శ‌కుడు శ్రీ‌జిత్ ముఖ‌ర్జీ. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తి అయ్యింది. ప్ర‌స్తుతం పోస్టు ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. డిసెంబర్ 3వ తేదీ మిథాలీ రాజ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు మూవీ మేక‌ర్స్. ‘శభాష్‌ మిథు’ సినిమాను ఫిబ్రవరి 4న విడుదల చేయబోతున్న‌ట్టు తెలిపారు. 

Read Also: https://telugu.asianetnews.com/entertainment/priyanka-chopra-husband-nick-jonas-entry-in-bollywood-as-a-hero-r3hihr

ఈ విష‌యం తెలుసుకుని మిథాలీ రాజ్ తన ఆనందాన్ని వ్య‌క్త‌ప‌రించింది.  త‌న పుట్టిన రోజున తన బయోపిక్ విడుదల తేదీని ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉంద‌నీ, ఆ ఆనందాన్ని మాటల‌లో చెప్ప‌లేక‌పోతునని మిథాలీ అన్నారు. ‘శభాష్‌ మిథు’ సినిమా నిర్మాణంలో  భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ మూవీలో తాప్సీ ప‌న్నుతో పాటు విజ‌య్ రాజ్ కూడా న‌టిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ షెడ్యూల్స్ తారుమారు కావడంతో ఈ మూవీని డైరెక్ట్ చేయాల్సిన రాహుల్ ధోలాకియా ప్రాజెక్ట్ నుండి తప్పుకోవడంతో శ్రీజిత్ మెగాఫోన్ పట్టుకోవాల్సి వచ్చింది.  

ఇక  హైద‌రాబాదీ విమెన్ క్రికెట‌ర్ మిథాలీరాజ్(Shabaash Mithu) టీమిండియా మ‌హిళ క్రికెట్ జ‌ట్టులో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్నది.  ఆమె గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ప్ర‌పంచ క్రికెట్ లో ఆమె టాప్ ప్లేయ‌ర్ గా ఉన్నారు. ప్ర‌స్తుతం ఆమె వ‌న్డే, టెస్టు జట్ల‌కు కెప్టెన్ గా కూడా ఉన్నారు. మ‌రీ లేడీ క్రికెటర్ మిథాలీ రాజ్ గా తాప్సీ ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.

Follow Us:
Download App:
  • android
  • ios