Asianet News TeluguAsianet News Telugu

పరిశ్రమలో విషాదం... సీరియల్ నటి ఆత్మహత్య!


సీరియల్ నటి రెంజూషా మీనన్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె తన నివాసంలో శవమై కనిపించింది. ఒక్కసారిగా పరిశ్రమ దిగ్భ్రాంతికి గురైంది. 
 

serial actress renjusha menon commits suicide ksr
Author
First Published Oct 30, 2023, 3:46 PM IST

మలయాళ చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. సీరియల్ నటి రెంజూషా మీనన్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తిరువనంతపురంలోని శ్రీకార్యంలో ఆమె నివాసం ఉంటున్నారు. అక్కడే నివాసంలో ఆమె శవమై కనిపించారు. రెంజూషా మీనన్ ఉరి వేసుకున్నట్లు సమాచారం. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆమె మృతికి గల కారణాలు వెలికితీస్తున్నారు. రెంజూషా మీనన్ మృతి వార్తతో కోలీవుడ్ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తమ సంతాపం ప్రకటిస్తున్నారు. 

రెంజూషా మీనన్ భర్తతో పాటు ఉంటున్నారు. ఆమె మరణించడానికి కొద్ది నిమిషాల క్రితం ఆమె రీల్ చేసినట్లు సమాచారం. సదరు రీల్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. రెంజూషా మీనన్ ఎంతో ఉత్సాహంగా కనిపించారు. అంతోలోనే ఆమె మరణ వార్త కలచి వేస్తుందని సన్నిహితులు వాపోతున్నారు. 

రెంజూషా మీనన్ మలయాళ సీరియల్ 'స్త్రీ' తో రంగప్రవేశం చేసింది. పలు చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ చేసింది. నిజలాట్టం, మలుగుడే అమ్మ, బాలమణి వంటి సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకున్నారు. సిటీ ఆఫ్ గాడ్, మెరిక్కొండు కుంజడు చిత్రాల్లో నటించారు. చివరిసారిగా ఆనందరాగం అనే సీరియల్ లో లీడ్ క్యారెక్టర్ రోల్ చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios