Asianet News TeluguAsianet News Telugu

లోకేష్ కనగరాజ్ - విజయ్ సినిమా ‘లియో’కు సెన్సార్ బోర్డు షాక్.. ఆ పదాలు, సీన్లు కట్.!

లోకేష్ కనగరాజ్ - విజయ్ దళపతి కాంబోలో రూపుదిద్దుకుంటున్న ‘లియో’ చిత్రానికి భారీ షాక్ తగిలింది. పలువురు  అభ్యంతరం వ్యక్తం చేయడంతో మూవీలోని సెన్సేషనల్ సాంగ్ లో పలు అంశాలను తొలగించింది.
 

Sensor Board Cut some Scenes in Vijay Thalapathy Leo movie song NSK
Author
First Published Sep 11, 2023, 4:26 PM IST

తమిళ స్టార్ దళపతి విజయ్ (Vijay Thalapathy)  చివరిగా ‘వారసుడు’తో అలరించారు. ప్రస్తుతం భారీ యాక్షన్ ఫిల్మ్  ‘లియో’తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేషన్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సెవెన్ స్కీన్ స్టూడియో బ్యానర్ గా గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. త్రిష హీరోయిన్. 14 ఏళ్ల  తర్వాత కలిసి వెండితెరపై అలరించబోతున్నారు. 

ఇదిలా.. ఉంటే వచ్చే నెలలో Leo రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఒక్క నెలరోజులు మాత్రమే సమయం ఉంది. ప్రస్తుతం అప్డేట్స్ కోసం ఆడియెన్స్, ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో లియోకు సెన్సార్ బోర్డ్ నుంచి షాక్ తగిలింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ గా ‘నా రెడీ’ అనే సాంగ్ విడుదలై ట్రెండ్ అయ్యింది. మరోవైపు వివాదానికి కూడా దారి తీసింది. సాంగ్ లో విజయ్ పొగతాగడం, వివాదాస్పాద పదాలకు డాన్స్ చేయడం వంటి వాటిపై రాజేశ్వరి ప్రియ అనే మహిళ అభ్యంతరం వ్యక్తం చేసింది.

నాన్ రెడీ పాటపై బీజీపీ ఆఫీస్ లోనూ కంప్లైంట్ చేసింది. ఈ విషయంపై సెన్సార్ సభ్యులూ స్పందించారు. ఆ పాటలో ఉన్న అభ్యంతర సన్నివేశాలు, వివాదాస్పాద పదాలను కట్ చేసింది. ప్రస్తుతం అలా ట్రిమ్ చేసిన సాంగ్ నే ఆయా ప్లాట్ ఫామ్స్ లో సంగీత ప్రియులకు అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది. సెప్టెంబర్ 19న సెకండ్ సింగిల్ కూడా రాబోతోంది. 

అక్టోబర్ 19న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, యాక్షన్ కింగ్ అర్జున్, దర్శకులు గౌతమ్ మీనన్, మిష్కిన్, మన్సూర్ అలీఖాన్ వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం భారీ యాక్షన్ గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ, మలయాళంలో గ్రాండ్ గా విడుదల కాబోతోంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios