Asianet News TeluguAsianet News Telugu

'అరవింద సమేత'కు శాటిలైట్, డబ్బింగ్ రైట్స్ తో రూ.50కోట్లు

ఓ ప్రముఖ ఛానెల్ ఈ సినిమా శాటిలైట్ హక్కుల కోసం రూ.22 కోట్లు చెల్లించడానికి ముందుకు వచ్చింది. అయితే హారిక హాసిని సంస్థ రూ.24 కోట్ల దగ్గర ఉన్నారు. మధ్యలో డీల్ కుదరాల్సివుంది. మరో వారం రోజుల్లో ఈ సంగతి ఓ కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉంది

sensational satellite deal for aravinda sametha

దర్శకుడు త్రివిక్రమ్ గత చిత్రం పెద్దగా ఆడకపోయినప్పటికీ దాని ప్రభావం అతడు డైరెక్ట్ చేస్తోన్న 'అరవింద సమేత'పై ఏ మాత్రం పడలేదనే చెప్పాలి. ఎన్టీఆర్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమా శాటిలైట్ బిజినెస్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఓ ప్రముఖ ఛానెల్ ఈ సినిమా శాటిలైట్ హక్కుల కోసం రూ.22 కోట్లు చెల్లించడానికి ముందుకు వచ్చింది. అయితే హారిక హాసిని సంస్థ రూ.24 కోట్ల దగ్గర ఉన్నారు. మధ్యలో డీల్ కుదరాల్సివుంది.

మరో వారం రోజుల్లో ఈ సంగతి ఓ కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉంది. హిందీ డబ్బింగ్ రేట్స్ ను దాదాపు రూ.22 కోట్ల వరకు కోట్ చేస్తున్నారు. దానికి కూడా బేరాలు జరుగుతున్నాయి. ఈ మధ్య స్టార్ హీరోల సినిమాలకు హిందీ డబ్బింగ్ మార్కెట్ లో మంచి డిమాండ్ ఏర్పడింది. అందుకే ఎన్టీఆర్ సినిమాకు ఆ రేంజ్ లో చెల్లించడానికి సిద్ధమవుతున్నారు. డిజిటల్ రైట్స్ మరో రూ.5కోట్లు వచ్చే ఛాన్స్ ఉంది.

అంటే మొత్తంగా చూసుకుంటే కేవలం శాటిలైట్, డబ్బింగ్ రైట్స్ కలుపుకొని ఈ సినిమా రూ.50 కోట్లు రావడం పక్కా. ఇక థియేట్రికల్ రైట్స్ దర్శకనిర్మాతలు ఎంత చెబితే అంత పెట్టి తీసుకోవడానికి బయ్యర్లు సిద్ధంగా ఉన్నారు. మొత్తానికి బిజినెస్ విషయంలో 'అరవింద సమేత' తన సత్తా చాటుతోంది. దాదాపు వంద కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ప్రీరిలీజ్ బిజినెస్ లోనే పాతిక, ముప్పై కోట్లు లాభం రావడం ఖాయమని అంచనా వేస్తున్నారు.  

Follow Us:
Download App:
  • android
  • ios