సోషల్ మీడియా యుగంలో ఏ వార్త అయినా క్షణాల్లో ప్రపంచం మొత్తం వ్యాపిస్తుంది. నిజానిజాల ప్రమేయం లేకుండా జనాల్లోకి చాలా త్వరగా వెళ్లిపోతున్నాయి. తాజాగా స్టార్ కపుల్ రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనెలపై ఓ సంచనల న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీపికా మరియు రణ్వీర్ వరల్డ్ మోస్ట్ డేంజర్ డాన్ గా పేరున్న దావూద్ ఇబ్రహీంతో కలిసి డిన్నర్ చేశారు అనేదే ఆ వార్త సారాంశం. దానితో పాటు వారు దావూద్ తో కలిసి ఉన్న ఓఫోటో సైతం చక్కర్లు కొడుతుంది. దీనితో ఈ  న్యూస్ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 

2013లో రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనే హీరో హీరోయిన్స్ గా దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ 'రామ్ లీలా' అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఆ మూవీ షూటింగ్ సంధర్భంగా ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో దిగిన ఓ ఫోటో వైరల్ అవుతుంది. దీపికా, రణ్వీర్ మరియు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీతో పాటు విందులో కూర్చుంది దావూద్ ఇబ్రహీం అని కొందరు వాదిస్తున్నారు. అలాగే ఆ సమయంలో వీరు దావూద్ ని కలిశారు అని నెటిజెన్స్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. 

ఐతే ఆ ఫొటోలో ఉన్నది దావూద్ కాదట. ఆ ఫొటోలో వీరితో పాటు విందులో పాల్గొంది సందీప్ సింగ్, ఆర్ వర్మన్ తో పాటు ఆర్ట్ డైరెక్టర్ వసీమ్ ఖాన్ అట. కాగా ఆ ఫోటోలు నెటిజెన్స్ దావూద్ గా భావిస్తున్న వ్యక్తి ఆర్ట్ డైరెక్టర్ వసీమ్ ఖాన్ అట. ఈ ఫోటోని సందీప్ సింగ్ చాలా కాలం క్రితమే తన అధికారిక ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో పాటు, ఫొటోలో ఉన్న అందరి పేర్లు క్రింద మెన్షన్ చేయడం జరిగింది. అసలు విషయం బయటికి వచ్చాక ఈ పుకారుకు బేక్ పడినట్లు అయ్యింది.