‘వకీల్‌సాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సెన్సేషనల్ గెస్ట్?
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ‘వకీల్‌సాబ్’. ఇప్పటికే ఈ సినిమాలో విడుదలైన మూడు పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ఎస్.ఎస్ తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. బాలీవుడ్‌లో హిట్ సాధించిన పింక్ చిత్రాన్ని తెలుగులో వకీల్‌సాబ్‌గా రీమేక్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పింక్'లో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను 'వకీల్ సాబ్'లో పవన్ కల్యాణ్ పోషిస్తుండడంతో సినిమాకు భారీ హైప్ క్రియెట్ అయ్యింది.
పవన్ కల్యాణ్ కీలక పాత్రలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘వకీల్‌సాబ్’. బాలీవుడ్‌లో మంచి విజయం సాధించిన ‘పింక్’ చిత్రానికి తెలుగు రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని రిలీజ్ కు రెడీ అవుతోంది. వేసవి కానుకగా ఏప్రిల్ 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో పవర్‌స్టార్ అభిమానుల్లో సంబరాలు చేసేస్తున్నారు. రాజకీయాల కారణంగా చాలాకాలం పాటు సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు పవర్‌స్టార్. ‘వకీల్‌సాబ్’తో మళ్లీ రీఎంట్రీ ఇవ్వనుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రమోషన్ ఈవెంట్ ని నిర్మాతలు ఏర్పాటు చేస్తున్నారు. ఏప్రియల్ 3న యూసఫ్ గూడ గ్రౌండ్స్ లో ఈ ఈవెంట్ జరగనుందని సమాచారం. ఈ ప్రమోషన్ ఈవెంట్ కు ఓ సెన్సేషన్ గెస్ట్ ని రప్పించాలని దిల్ రాజ్ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. హిందీ నుంచి అమితాబ్, తమిళం నుంచి అజిత్ వస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే వీళ్లిద్దరు కాదని ఎవరూ ఊహించని ఓ సెన్సేషన్ గెస్ట్ వస్తారని చెప్తున్నారు. చూడాలి మరి దిల్ రాజు ఎవరిని పిలవబోతున్నారు. వారి స్టేచర్..పవన్ స్దాయిలో ఉండాలనేది అభిమానులు కోరిక.
ఇక ఇప్పటికే విడుదలైన పాట, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ‘కోర్టులో వాదించడం తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు..’ అంటూ సినిమాలో వినోదం ఏ స్థాయిలో ఉండబోతోందన్నది రుచి చూపించారు. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. పవన్ సరసన శ్రుతిహాసన్ నటించింది. తమన్ సంగీతం అందించారు. హిందీలో మంచి విజయం సాధించిన పింక్ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే.
నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘పవన్ అభిమానులు, సినీ ప్రేక్షకులు కోరుకునేలా ఓ పవర్‌ఫుల్ లాయర్ పాత్రలో పవన్ కల్యాణ్‌గారు కనిపించబోతున్నారు. ’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్. తమన్ , కెమెరా: పి.ఎస్. వినోద్, కో ప్రొడ్యూసర్: హర్షిత్ రెడ్డి.