గా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా వచ్చిన తాజా చిత్రం విరూపాక్ష. ఈ సినిమా ఏప్రిల్ 21న విడుదలై మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంటుంది. ఇప్పుడు మే 21న నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.


ఈ సంవత్సరం టాలీవుడ్ భాక్సాఫీస్ దగ్గర భారీ రెవెన్యూస్ ఇచ్చిన చిత్రాల్లో సాయి ధరమ్ తేజ్ థ్రిల్లర్ చిత్రం “విరూపాక్ష” కూడా ఒకటి. యాక్సిడెంట్ తర్వాత ధరమ్ తేజ్ సెకండ్ లైఫ్ నుంచి వచ్చిన మొదటి సినిమాగా ఇది రాగా తన కెరీర్ లోనే పెద్ద హిట్ అవ్వడమే కాకుండా తన కెరీర్ లో 100 కోట్ల గ్రాసర్ గా నిలిచింది. ఇప్పటికీ థియేట్రికల్ గా బాగానే రన్ అవుతూ ఆల్మోస్ట్ రన్ చివరికి రాగా ఫైనల్ గా అయితే ఈ సినిమా ఓటీటీ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం నిన్నటి నుంచి అయితే అందుబాటులోకి వచ్చేసింది. ఈ నేపధ్యంలో ఈ సినిమాకు ఓటిటిలో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతోందో చూద్దాం.

మార్నింగ్ షో తోనే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ మూవీ మే 20 శనివారం అర్థరాత్రి నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. దీంతో ఓటీటీలో ఈ సినిమాను చూసేందుకు ఆడియన్స్ ఉత్సాహపడుతున్నారు. థియేటర్ లో చూసిన వారు సైతం మళ్లీ ఓటిటిలో చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో వారు పెట్టే పోస్టులే సాక్ష్యం. అలాగే సినిమాకి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడంతో.. థియేటర్ లో మిస్ అయినా వాళ్ళు ఓటీటీలో చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇవన్నీ చూస్తూంటే ఓటీటీలో కూడా ఈ సినిమా దుమ్ముదులిపేయడం ఖాయమని అంటున్నారు.

చిత్రం కథేంటేంటే

ఈ సినిమా రుద్రవనం అనే గ్రామంలో జరుగుతుంది. 1979లో క్షుద్ర పూజలు చేస్తూ చిన్న పిల్లల ప్రాణాలు తీస్తున్నారనే నెపంతో ఓ జంటను కొట్టి చంపుతారు గ్రామస్తులు. అది జరిగిన పుష్కరకాలం తర్వాత సూర్య(సాయి ధరమ్‌ తేజ్‌) తన తల్లితో కలిసి ఆ గ్రామానికి వస్తాడు. ఆ గ్రామంలో జాతర జరుగుతుండడంతో 15 రోజులు అక్కడే ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో ఆ ఊరి సర్పంచ్‌ హరిశ్చంద్ర(రాజీవ్‌ కనకాల) కూతురు నందిని(సంయుక్త మీనన్‌)తో ప్రేమలో పడతాడు. ఆమెను ఒప్పించడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తుంటాడు.
 ఆ సమయంలోనే రుద్రవనం గ్రామంలో వరుసగా మరణాలు సంభవిస్తాయి. అందులో సూర్య పెదనాన్న కూతురు పార్వతి(యాంకర్‌ శ్యామల) కూడా ఉంటుంది. 

అనుమానాస్పద మరణాల సంఖ్య పెరుగుతుండడంతో ఊరి ప్రజలంతా భయంతో వణికిపోతారు. చేతబడి కారణంగానే మరణాలు సంభవిస్తున్నాయని పూజారి (సాయిచంద్‌) ఊరినంతా అష్టదిగ్బంధనం చేయిస్తారు. అసలు ఆ ఊరిని పట్టిపీడుస్తున్న ఆ దుష్టశక్తి ఏంటి? చావుల వెనుక ఉన్న రహస్యం ఏంటి? ప్రేమించిన అమ్మాయి నందినిని రక్షించుకోవడం కోసం సూర్య ఎం చేశాడు? ఆ మిస్టరీ డెత్స్ కారణంగా భయపడుతున్న ఊరి ప్రజలకు ఎలాంటి విముక్తిని ఇచ్చాడు? చివరకు ఏం జరిగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

సాయి ధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు రూపొందించిన హర్రర్ మూవీ ‘విరూపాక్ష’. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించగా సునీల్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అంజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని అందించగా , శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై దీన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు.