స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమాలో టబు కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.

టబు సెట్ లో స్క్రిప్ట్ చదువుతున్నప్పుడు తీసిన వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా రెండో షెడ్యూల్ హైదరాబాద్ లో జరుగుతోంది. పూర్తి స్థాయి కుటుంబకథా చిత్రంగా రూపొందిస్తున్నారు.

ఈ సినిమాలో అల్లు అర్జున్ సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా కనిపించబోతున్నారు. గీతాఆర్ట్స్, హారికా హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.