మరో సీనియర్ హీరోయిన్ రీ ఎంట్రీకి రంగం సిద్ధం అయ్యింది. నిన్నటితరం హీరోయిన్ భానుప్రియ సోదరి శాంతిప్రియ మళ్ళీ తెరపై మెరుపులు మెరిపించబోతోంది.  ఓ బయోపిక్ మూవీలో నటిచబోతోంది మహర్షి హీరోయిన్. 

మరో సీనియర్ హీరోయిన్ రీ ఎంట్రీకి రంగం సిద్ధం అయ్యింది. నిన్నటితరం హీరోయిన్ భానుప్రియ సోదరి శాంతిప్రియ మళ్ళీ తెరపై మెరుపులు మెరిపించబోతోంది. ఓ బయోపిక్ మూవీలో నటిచబోతోంది మహర్షి హీరోయిన్.

సినిమా ప్రేమికులకు నిన్నటితరం హీరోయిన్ శాంతి ప్రియ తెలిసే ఉంటుంది. భాను ప్రియ సోదరిగా ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి.. కొన్ని సినిమాలు మాత్రమే చేసిన ఈ హీరోయిన్ .. మహర్షి సినమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర అయ్యింది. అటు తెలుగుతో పాటు.. ఇటు తమిళ సినిమాలు కూడా చేస్తూ... మరో వైపు హిందీ పరిశ్రమల్లో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది శాంతి ప్రియ. 

కెరీర్ మంచి ఊపు మీద ఉన్న టైమ్ లోనే పెళ్ళి చేసుకుని సిల్వర్ స్క్రీన్ కు దూరం అయ్యింది శాంతి. వివాహం అనంతరం నటనకు దూరమై.. పూర్తిగా వ్యక్తిగత జీవితానికే సమయం కేటాయించింది. ఇక మళ్లీ ఇన్నేళ్లకు తిరిగి తెరపైకి వస్తున్నదీ నటి. స్వాతంత్య్ర సమరయోధురాలు సరోజినీ నాయుడు బయోపిక్‌లో నటించబోతున్నట్లు రీసెంట్ గా ఓ ప్రకటన విడుదల చేసింది శాంతిప్రియ. అంతే కాదు తాను తెరకు దూరం అవ్వడానికి గల కారణాలు కూడా తెలిపింది.

శాంతి ప్రియ మాట్లాడుతూ... పెళ్లయ్యాక భార్యగా, తల్లిగా నాపై ఉన్న బాధ్యతలు నెరవేర్చాలనుకున్నా. అందుకే సినీ రంగానికి దూరమయ్యా. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్లయ్యారు. నేను మళ్లీ నటించేందుకు వాళ్ల ప్రోత్సాహమే కారణం. ఇవాళ చిత్ర పరిశ్రమల్లో పెళ్లయిన తారలే కాదు పిల్లలున్న వారు కూడా నటిస్తున్నారు. తమకిష్టమైన రంగంలో కొనసాగుతున్నారు. నటిగా తిరిగి వెండితెరకు రావడం సంతోషంగా ఉంది అన్నారు. 

ఇక ప్రస్తుతం సరోజినీ నాయుడు జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోన్న సినిమాలో నటిస్తున్నాను. ఇది పాన్‌ ఇండియా సినిమా. సరోజినీ నాయుడు ఆహార్యం, హావభావాలు సరిగ్గా పలికేలా సాధన చేస్తున్నాను. వచ్చే నెల నుంచి ఈ సినిమా సెట్స్‌ మీదకు వెళ్తున్నది అని అన్నారు శాంతి ప్రియ. ఇక ఈసినిమాకు సంబంధించి అఫీషయల్ గా వివరాలు తెలియాల్సి ఉంది.